• HOME
  • భక్తి
  • అనంత ఫలితాన్నిచ్చే వరలక్ష్మీ వ్రతం

  శుభకార్యాలకు శ్రావణం ఎంతో శుభసమయం. చాంద్రమానం ప్రకారం ఇది 5వ మాసం. శ్రీ కృష్ణ జన్మాష్టమి, రక్షా బంధన్, హయగ్రీవ జయంతి వంటి పండుగలున్న ఇది పండుగల మాసం. ఈ మాసంలో వచ్చే పున్నమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రముతో కూడి ఉన్న కారణంగా దీనికాపేరు వచ్చింది. శ్రవణా నక్షత్రము శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం కావడం ఈ మాసపు విశిష్టతకు గల మరో కారణం. శ్రావణ మాసంలోని మంగళ, శుక్ర వారాలు మరింత పవిత్రమైన రోజులు. ఈ రోజుల్లో లక్ష్మీ ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా.. ఈ మాసంలో పున్నమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మహిళలు చేసే వరలక్ష్మీ వ్రతం అనంతమైన ఫలితాన్నిస్తుంది. 

వ్రత విశేషాలు

వివాహమైన స్త్రీలు ఆచరించే వ్రతాలలో ఇది ప్రధానమైనది. సాధారణము గా ఇది ఈ మాసపు రెండవ శుక్రవారము అవుతుంది. శ్రీ మహాలక్ష్మి మగధ దేశంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ కలలో కనిపించి ఈ వ్రతం ఆచరించమని చెబుతుంది. ఆ ప్రకారమే చారుమతి భక్తిశ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించి సకల సంపదలు పొందుతుంది. ఈ వ్రత మహత్తును ఆమె ఇతర మహిళలకు చెప్పటంతో ఈ వ్రతం లోక వ్యాప్తమైందని వరలక్ష్మీ వ్రతకల్పం చెబుతోంది. మరో గాథ ప్రకారం.. ఒకప్పుడు శివ పార్వతులు జూదం ఆడుతూ ఉన్న సమయం లో చిత్రనేమి అనే గంధర్వుని మధ్యవర్తి ఉండమని కోరతారు. అతని పక్షపాత బుద్ధితో పరమేశ్వరునిదే విజయమని ప్రకటిస్తాడు. దీనికి కోపించిన పార్వతి ఆ గంధర్వుని కుష్ఠురోగివి కమ్మని శపిస్తుంది. అయితే.. తన తప్పు ఒప్పుకొని శాపాన్ని తొలగించమని ఆ గంధర్వుడు పార్వతీదేవిని వేడుకోగా వరలక్ష్మి వ్రతం గొప్పతనాన్ని తెలియజేసి దీన్ని ఆచరించమని చెప్పినట్లు కథనం. ఈ శ్రావణ శుక్రవారపు రోజున భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సంపదల తల్లి అయిన శ్రీమహాలక్ష్మి ఆశీస్సులు పొందుదాం.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE