దక్షిణాదిన గల పుణ్యక్షేత్రాల్లో కంచి ఒకటి. మోక్ష సిద్ధిని అనుగ్రహించే 7 క్షేత్రాల్లో కంచి మొదటిది.  శైవ, శక్తి, వైష్ణవ క్షేత్రమేగాక, షణ్ముఖుని నివాస ప్రదేశం. భరత భూమికిది నాభిస్థానమని చెబుతారు. శ్రీరామ చంద్రుడు సీతావియోగంతో అరణ్యాలో సంచరిస్తూ కాంచీ క్షేత్రానికి వచ్చినట్లు, అగస్త్య మహాముని, బలరాముడు, ప్రహ్లాదుడు, విభీషణుడు, పరశురాముడు, అర్జునుడు వంటి ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శిం చి తరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి.అద్వైతానికి మూలమైన కంచిలోనే ఆదిశంకరులు కామకోటి పీఠాన్ని అధిష్టించిన సంగతి తెలిసిందే. తాను కైలాసం నుండి తెచ్చిన పంచ లింగాలలో ఒకటైన యోగలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించి అర్చిస్తూ కామకోటి పీఠాన్ని వర్ధిల్లజేశారు. 

     కంచిలో ఉన్న ఈశ్వరుని ఏకామ్రనాథునిగా పిలుస్తారు. ఈ ఏకామ్రనాథుని కోవెలలో వేదాలన్నీ మామిడి చెట్టురూపంలో ఆవిర్భవించాయయనీ, అందుకే .. నేటికీ ఈ మామిడి వృక్షం పూజనీయమైనదనీ భక్తుల నమ్మకం. కాంచీక్షేత్ర ప్రధాన దేవత.. కామాక్షీ దేవి.  అమ్మవారి ఆలయం శ్రీ చక్ర ఆకారంలో నిర్మించబడింది. దీని మధ్య భాగంలో సిద్ధాసనంలో, చతుర్భుజరూపిణియై శ్రీకామాక్షి దేవి భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడి అమ్మవారి విగ్రహానికి ముందు ఆదిశంకరులు సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి, ప్రతిష్టించిన శ్రీ చక్రాన్నీ చూడవచ్చు. కంచిలో ఏ జీవి అయినా ఒక్క పర్యాయం ఏదన్నా కోరుకొంటే అది కోటి రెట్లుగా ఫలితం ఇస్తుంది. అందుకే ఇది కామకోటి అయింది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE