జీవితంలో అనిత్యమైన, శాశ్వతమైన అంశాలను గమనించి జీవితాన్ని గడపటమే నిజమైన విద్యగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సత్యాల్ని గ్రహించగలిగే శక్తిని, బుద్ధిని ఇవ్వగలిగిన దేవుడు గణపయ్య మాత్రమే. ఆ స్వామి రూపంలోనే ఇందుకు సంబంధించిన పలు విశేషాలు దాగి ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. 

గణేశుని ఏనుగు తల.. బుద్ధి సూక్ష్మత, వివేచన, జ్ఞానాలకు సంకేతం. ఏనుగు ఎప్పుడూ గంభీరంగా, అప్రమత్తంగా ఉండి, పరిసరాలను గమనిస్తూ ముందుకు సాగుతుంది. జంతువుల్లో అన్నిటికంటే దానికి జ్ఞాపకశక్తి అత్యధికం. దట్టమైన అరణ్యంలో సంచరించేటప్పుడు నిర్దిష్తమైన మార్గంలో సాగేటప్పుడు తనకు తెలియకుండానే ఇతర జంతువులకు మార్గనిర్దేశం చేయడం ఏనుగు స్వభావం. వినాయకుడు సర్వ ప్రపంచానికీ మార్గదర్శకుడు. ఆయన విఘ్నాలకు నాయకుడు, అవసరమైనప్పుడు విఘ్నాలు కలిగించేదీ ఆయనే. తనను భక్తితో తలచుకున్న వారి విఘ్నాలను అధిగమించడంలో తోడ్పడేదీ ఆయనే. 

వినాయకుడి వాహనం ఎలుక. మూషికం చీకటికీ, అజ్ఞానానికీ గుర్తు. వినాయకుడు ఈ రెంటినీ జయించటమే గాక వాటిని పారద్రోలి ప్రపంచాన్ని జ్ఞాన ప్రకాశంతో నింపుతాడు. మూషికం వాసనను బట్టి తిరుగుతుంది. మనిషీ అంతే. అయితే ఈ లౌకిక వాసనలను జయించగలిగేలా మనసును అదుపులో పెట్టుకోవాలని ఈ వాహనం మనకు సూచిస్తుంది. ఇక.. వినాయకుని భార్యలు బుద్ధి, సిద్ధి. వారిద్దరూ వివేకం, ఆత్మసాక్షాత్కారాలకు ప్రతీకలు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE