మన సంప్రదాయంలో శంఖం పవిత్రతకు, సంపదకు ప్రతీక. శం(మంచి), ఖం(జలము)ల కలయికైన శంఖ శబ్దానికి పవిత్ర జల పాత్ర అని అర్థం. శంఖాన్ని పూజించటం, శంఖజలంతో అభిషేకించడం తెలిసిందే. శంఖంలో పోస్తేగానీ తీర్ధం అనే నానుడీ తెలిసినదే. భౌద్ధం, చైనీస్ బుద్ధిజంలోనూ శంఖారావం చేసే సంప్రదాయం ఉంది. మానససరోవర్‌, లక్షద్వీప్‌, కోరమండల్‌, శ్రీలంక, మరికొద్ది ప్రాంతాల్లో మేలైన శంఖాలు లభిస్తున్నాయి. చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాదం వినిపిస్తే అది మేలైన శంఖమని నిపుణుల మాట .

ప్రాశస్త్యం

శ్రీమహావిష్ణువు చేతిలో నిరంతరం అలరారే శంఖం క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవితో బాటు ఆవిర్భవించిన 14 అద్భుత ప్రసాదాల్లో ఒకటి. అందుకే దీన్ని సముద్ర తనయ అంటారు. శంఖం పీఠభాగంలో వరుణ, చంద్ర, సూర్యులు, ఉపరితలంపై ప్రజాపతి ఉండగా ముందు భాగాన గంగా సరస్వతులు ఉంటారని పురాణవచనం. యజ్ఞయాగాదులు, తాంత్రిక పూజలలో శంఖం ఊదటం కనిపిస్తుంది. శంఖధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తికి ప్రతీక. శంఖనాదం చేయటం లేదా ఆ ధ్వని వినడం వల్ల 6నెలల పురాణ శ్రవణ లేదా వేదం ఘోష విన్న ఫలం దక్కుతాయని పెద్దల విశ్వాసం. కురుక్షేత్ర సమయాన శ్రీకృష్ణుని శంఖాన్ని పాంచజన్యాన్ని, ధర్మరాజు, భీమ,అర్జున, నకుల,సహదేవులు అనంత విజయ, పౌండ్ర, దేవదత్త, సుఘోష,మణిపుష్పకాలనీ శంఖాలను పూరించారు. 

శంఖధ్వని విశిష్టత

 సముద్రంలోని మొలాస్కా ఆత్మరక్షణ కోసం ఏర్పరచుకొనే కవచమే శంఖం. అందులోని ధాతువుల కారణంగా శంఖ తీర్థాన్ని రోజూ సేవిస్తే మంచిది. శంఖనాదపు కంపనాలు వాతావరణంలోని హానికారక క్రిములను నశింపజేస్తాయి. రోజూ శంఖారావం చేసేవారిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందనీ, ప్రాణాయామం చేసిన ఫలితం లభిస్తుందనీ పెద్దలు చెబుతారు. ఇంకా.. గుండె, మెదడు, లంగ్స్ పనితీరు బాగా మెరుగుపడుతుంది.

రకాలు

ఆకారాన్ని బట్టి శంఖాలు పలురకాలు. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృత శంఖమని, కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు. దక్షిణావృత శంఖాలను పూజకు, ఉత్తరావృతాన్ని ఊదటానికి వాడతారు. నోరు పెద్దది పొట్ట చిన్నదిగా ఉన్నదాని శని శంఖమనీ, సర్పాకారంలో ఉండేవాడిని రాహు, కేతు శంఖాలంటారు. ఒంటినిండా ముళ్ళున్న శంఖాన్ని రాక్షస శంఖమంటారు. ఇవిగాక లక్ష్మీ, గోముఖ, కామధేను, దేవ, సుఘోష, గరుడ, మణిపుష్పక అనే పలు రకాలున్నాయి.

శంఖ పూజ

శంఖాన్ని గంగాజలం, పాలు, తేనె, నేయి, బెల్లంతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తే సర్వదోషాలూ తొలగి ఆ ఇల్లు సిరుల నిలయమవుతుంది. ఇలాంటి ఇంట ఏ వాస్తుదోషమూ ఉండదు. శంఖాన్ని ఎర్ర ఆవుపాలతో నింపి ఇల్లు అంతా చల్లి, కొద్దిగా ఇంటి సభ్యులు అంతా సేవిస్తే సకల రోగాలు, దు:ఖాలు దూరమవుతాయి. 

గమనిక : శంఖాన్ని సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాతే పూరించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE