• HOME
  • భక్తి
  • త్యాగానికి ప్రతీక.. బక్రీద్

ఈ రోజు బక్రీద్ పండుగ. మహమ్మదీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పండుగ త్యాగానికి ప్రతీక. బక్రీద్ రోజు ప్రతి ముస్లిం కుటుంబం తమ శక్తి కొద్ది అల్లా పేరిట బలి ఇస్తారు. దీన్నీ ఖుర్బాని అంటారు. ధన, ప్రాణ త్యాగాలతో పాటు స్వార్థం, అసూయ, రాగద్వేషాలను త్యాగం చేసి మానవతను చాటాలన్నదే బక్రీద్ పండుగ అంతరార్థం. 

ఇబ్రహీం ప్రవక్త

ఖురాన్ ప్రకారం.. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ప్రవక్త ఒకరు. మక్కా పట్టణాన్ని నిర్మించటంతో బాటు ఆరాధన కోసం కాబా నిర్మాణం చేసిన గొప్ప మహనీయుడు. అయితే ఒకనాడు ఆయన తన ముద్దుల కుమారుడైన ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్లు కలగంటాడు. అల్లాహ్ ఖుర్భాని కోరుతున్నాడని తెల్లవారగానే ఒంటెను బలిస్తాడు. మళ్లీ అదే కల రావడంతో ఆయన కోరినది తన కుమారుడనని తెలుసుకొని అందుకు సిద్దమవుతాడు. భగవంతుని పట్ల అచంచల విశ్వాసంతో ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్‌కు సిద్దమైన ఇబ్రహీం ప్రవక్త త్యాగనిరతికి మెచ్చిన అల్లాహ్ జిబ్రాయిల్ దూత ద్వారా కుమారునికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని కోరుతాడు. నాటి నుంచి ఈ రోజు ఖుర్బాని ఇవ్వడం ఆనవాయితీగా మారింది. 

ఖుర్బాని నియమాలు

ఖుర్బాని అనేమాటకు బలి అనే అర్థంతో బాటు దైవ సాన్నిధ్యాన్ని పొందడం, దైవానికి సమర్పించడం. దైవం కోసం త్యాగం చేయడం అనే అర్థాలున్నాయి. ఖుర్బాని ఇచ్చిన మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం నిరుపేదలకు, ఇంకో భాగం సమీప బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రతి ముస్లిం విధిగా ఖుర్భాని కోసం స్థోమత ప్రకారం అవయవలోపం లేని, ఆరోగ్యకరమైన ఒంటె, ఆవు, మేక లేదా గొర్రెను దైవమార్గంలో సమర్పించాలి. ఖుర్బాని జంతువుల్లో ఐదేళ్ల వయస్సు పై బడిన ఒంటె, రెండేళ్ల పై బడిన ఆవు, కనీసం ఏడాది వయస్సున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. ఆవు, ఒంటెలను వ్యక్తుల తరపున, మేక, గొర్రెలను వ్యక్తి తరపున ఖుర్బాని ఇస్తారు.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE