శరన్నవరాత్రుల మూడో రోజు అమ్మవారు చంద్రఘంటా దేవిగా పూజలు అందుకొంటుంది. పరమ శాంతిదాయకమైన, శుభములు చేకూర్చే రూపం గల ఈ అమ్మవారి శరీరం బంగారు వన్నెతో మెరుస్తూ ఉంటుంది. ఈమె శిరస్సున ఉండే అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు వచ్చింది. సింహ వాహనం మీద ఆసీనురాలై 10 చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండి రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.ఈ దినమున సాధకుని మనస్సు మణి పూరచక్రమునందు యుండును. ఈమెను ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు లభించటమే గాక ఇహ, పర ముక్తి లభిస్తుంది.

శ్లోకం

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।

ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE