యోగ సంప్రదాయంలో సూర్యుడు ఉత్తరం నుండి దక్షిణ దిశగా ప్రయాణాన్ని సాగించే కాలాన్ని దక్షిణాయనం అంటారు. దీన్నే 'సాధనా పధం' అంటారు. ఇది అన్యోన్యతని ఉద్దీపనము చేసే సమయం. అది ప్రకృతి స్త్రీత్వాన్ని మూర్తీభవించే సమయం. అప్పుడు భూమి తన స్త్రీత్వాన్ని ధరిస్తుంది. స్త్రీ శక్తితో నిండిన పండుగలు జరుపుకునేది ఈ 6 నెలలలోనే. ఈ దేశ సంస్కృతి అంతా దానితో శృతి కలిసి ఉంది. ఈ సమయంలోని ప్రతి నెలలోనూ ఏదో ఒక పండుగ వస్తుంది. ఈ స్త్రీత్వం నిండిన ఆరు నెలలలో సెప్టెంబరు 22న శరద్ విషువత్తు (అంటే రాత్రి పగలూ సమంగా ఉండే రోజు)వస్తుంది. ఆ రోజు తర్వాత వచ్చే మొదటి అమావాస్య మొదలుకుని ఉత్తరాయణం మొదలయ్యే వరకు గల 3 నెలల కాలాన్ని “దేవీ పధం” అంటారు. ఈ త్రైమాసికంలో, భూమి ఉత్తరార్థగోళంపై అతి తక్కువ సూర్యకాంతి పడటంతో అక్కడి ప్రకృతి మొత్తం మందకొడిగా మారుతుంది. అక్కడి ఏ జీవీ సహజమైన చురుకుదనంతో పని చెయ్యలేదు.

 

మహాలయ అమావాస్య తరువాతి రోజు నవరాత్రి మొదలవుతుంది. నవరాత్రి అంతా ఈ స్త్రీ దేవతే. నవరాత్రి సందర్భంగా కర్ణాటకలో చాముండేశ్వరిని, బెంగాలులో 'దుర్గ' ఆరాధన సాగుతుంది. ఇలా దేశంలో ఒక్కోచోట ఒక్కో దేవత పూజ సాగుతుంది. అయితే ఈ పేర్లలో తేడాలు ఉన్నా స్థూలంగా పూజలందుకొనేది మాత్రం స్త్రీ దేవతలే. అందుకే ఇది దైవత్వాన్ని ఆరాధించే పండగ.               

                                                                                                                           (ఈశా ఫౌండేషన్ సౌజన్యంతో)Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE