• HOME
  • భక్తి
  • శైలపుత్రిగా పూజలందుకొంటున్న అమ్మ

   శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిస్తోంది. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై జన్మంచినందు వల్ల ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. విశ్వచైతన్య శక్తియైన అమ్మవారు హిమవత్పుత్రీకగా జన్మించి, అపర్ణగా ఎదిగి సకలశక్తి సమన్వితగా, ధర్మార్ధకామ మోక్ష ప్రదాయిని అమ్మ. పార్వతి, హైమవతి అనేవి ఈమె పేర్లే. ఈ రోజు అమ్మవారు బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు ఆవునేతి పొంగలిని అమ్మవారికి నివేదిస్తారు. ఈ రోజు కనకదుర్గమ్మను భక్తితో ఆరాధించేవారికి సకల గృహ సమస్యలు తొలగిపోవటమే గాక అనంతమైన శక్తి, సంపదలు సిద్ధిస్తాయి. 

శ్లోకం

వందేశాంఛిత లాభాయ చంద్రార్థాకృత శేఖరామ్‌|

వృషారూఢాంశూలాధరం శైలపుత్రీ యశస్వనామ్‌||



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE