దుర్గ అంటే దుర్గమైనది. అంటే జయింపవీలుకానిది. దుర్గతులను తొలగించేది. దుర్గముడనే రాక్షసుడిని సంహరించినందున అమ్మవారికి దుర్గ అనే పేరు వచ్చిందని పురాణ కథనం. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. మోక్ష ప్రదాయిని, శత్రునాశిని, విజయకారిణి అయిన దుర్గ అనుగ్రహం ఉంటే భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిజేరవు. ఎంతటి క్రూర గ్రహబాధలైనా తొలగిపోతాయి. దేవీ నవరాత్రులు 8వ రోజు పరాశక్తి దుర్గగా పూజలందుకొంటుంది. దుర్గాష్టమినే మహాష్టమి లేక వీరాష్టమిగానూ జరుపుకొంటారు. కోరి కొలిచేవారికి కొంగు బంగారం దుర్గ. 

పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచి తిరిగి దుర్గాష్టమి రోజే వాటిని దించిన కారణంగా ఈ రోజు ఆయుధ పూజ చేయటం సంప్రదాయం. దీనిని అనుసరించి ఆయా వృత్తులవారు తాము వాడే యంత్రాలు, ఆయుధాలు, పనిముట్లను కడిగి పూజిస్తారు. మరో కథనం ప్రకారం అమ్మవారు లోహుడనే రాక్షసుని వధించగా లోహం పుట్టిందనీ, అందుకే ఈ రోజు లోహపరికరాలని పూజించే పద్దతి వచ్చిందని చెబుతారు. ఈ రోజు ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి యథాశక్తి దక్షిణ, తాంబూలాలతో సత్కరించి భోజనం పెట్టటం వల్ల అమ్మవారి కృప సిద్ధిస్తుంది.దుర్గాష్టమి రోజున నూతన వ్యాపారాలు ఆరంభించటం శుభప్రదమని నమ్ముతారు. 

ఈ రోజున అమ్మవారిని ఎర్రని వస్త్రం, ఎర్రని అక్షతలు, ఎర్రని పుష్పాలతో పూజిస్తారు. ఈ రోజున దుర్గా సూక్తం పారాయణంతో బాటు “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రాన్ని జపించటం వల్ల విశేష ఫలితం సిద్ధిస్తుంది. ఈ రోజు అమ్మవారికి కదంబం, మినపగారెలు, నిమ్మరసం నివేదనం చేస్తారు.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE