• HOME
  • భక్తి
  • మ‌హాల‌క్ష్మీదేవిగా దర్శనమిస్తున్న అమ్మ

శరన్నవరాత్రుల్లో ఏడవరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తోంది. త్రిశక్తి రూపాలలో ధనాధిష్ఠాన దేవత శ్రీ మహాలక్ష్మి. సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్ట లక్ష్ముల సమష్టి రూపమే శ్రీ మహాలక్ష్మి. ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా, ప్రసన్న వదనంతో, ఇరు హస్తాల్లో పద్మాలతో బాటు అభయ వరద హస్త ముద్రలతో నయన మనోహరంగా భక్తకోటిని తరింపజేస్తోంది. లోకకంటకుడైన డోలాసురుడనే రాక్షసుడిని వధించిన ఈ దేవిని ఉపాసిస్తే సత్వర కార్యసిద్ధి, సల్కా శుభాలు సిద్ధిస్తాయి. ఈ రోజున భక్తితో 'ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పూర్ణాలు నివేదన చెయ్యాలి. ఎరుపు రంగు పూలతో పూజించాలి, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE