శరన్నవరాత్రి దీక్షలో నవమి ఎంతో విశేషమైనది. ఈ తిథి మంత్ర సిద్దికి అనుకూలమైన తిథి. అందుకే నవమిని 'సిద్ధదా' అంటారు. శరన్నవరాత్రి తొమ్మిదవరోజు అమ్మవారు మహిషాసుర మర్దనిగా దర్శనమిస్తోంది. ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజ శుద్ధనవమి నాడు లోకకంటకుడైన మహిషాసురుని సంహరించి లోకసంరక్షణ చేసిన కారణంగా ఈ రోజును మహార్నవమిగా భక్తులు జరుపుకొంటారు. సింహవాహనంపై ఆయుధధారిణిగా సకల దేవతల అంశలతో ఈ రోజు అమ్మ దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మను భక్తితో పూజించేవారికి శత్రుభయం తొలగి సకల విజయాలు లభించటమే గాక సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. తన పూర్వజులకు స్వర్గప్రాప్తి కలిగించేందుకు భగీరదుడు గంగను భువికి తెచ్చిన రోజుకూడా ఇదే. దేవి ఉపాసకులు ఈ రోజు వరకు తాము చేసిన జపసంఖ్య ఆధారంగా హోమం చేస్తారు. క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు, ఇతర కులవృత్తులవారు అందరూ ఈ రోజున ఆయుధపూజ నిర్వహిస్తారు. 

ఈ రోజున చండీ సప్తశతి పారాయణంతో బాటు చండీ హోమం చేసేవారికి విశేష ఫలం సిద్ధిస్తుంది. ఇది చేయలేనివారు కనీసం 'ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా' అనే మంత్రాన్ని జపించాలి. ఈ రోజు పూజానంతరం చిత్రాన్నం, గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE