ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సుకు ఏకాగ్రత ఉండదు. అందుకే పెద్దలు దీవించేటప్పుడు ‘‘ఆయురారోగ్య ఐశ్వర్య, సంతాన, ఉద్యోగ ప్రాప్తిరస్తు’’ అంటారు. ఆయువు తర్వాత ఆరోగ్యానికే పెద్దలు ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తుంది. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. క్షీరసాగర మథనంలో ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నాడు శ్రీమన్నారాయణుని అంశగా చేత అమృత కలశంతో అవతరించాడు. భారతీయ సంప్రదాయ వైద్యంఆయుర్వేదం. మన ప్రాచీన వైద్యులైన సుశ్రుతుడు, చరకుడు తదితరుల వైద్య విధానాలకు ధన్వంతరి ఆయుర్వేదమే మూలం.అధర్వణవేదంలోని ఆయుర్వేదాన్ని అందరికీ అందించినవాడు దేవ వైద్యుడైన ధన్వంతరి. 

బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ధన్వంతరి సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్నాడు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.'ధన్వంతరి' అనే బిరుదుగల కాశీరాజు దేవదాసు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఈయన పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది. అలాగే విక్రమాదిత్యుని ఆస్థాన పండితుల్లో ఒకడుగా గుర్తింపు పొందాడు. 'ధన్వంతరి నిఘంటువు' కర్త కూడా ఈయనే. 

ధన్వంతరి భవరోగాలను పోగొట్టే దైవం. ఆయుర్వేద వైద్యులు ఈ రోజు ధన్వంతరీ పూజ, ధన్వంతరి వ్రతాన్ని చేస్తారు. అందుకే ఈరోజు నారాయణుడిని, ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేస్తే సకల రోగాలు పటాపంచలవుతాయి. దీర్ఘరోగాలతో బాధపడేవారు ఈరోజు కేరళ రాష్ట్రంలో త్రిశూరవద్ద ధన్వంతరి ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం. పూజలో భాగంగా ధన్వంతరి పటాన్ని కుంకుమతో, పుష్పాలతో అలంకరించి, స్వామి సహస్రనామాన్ని పఠిస్తూ తెల్లపూవులు లేదా తులసీ దళాలతో అర్చించాలి. అనంతరం పాయసాన్ని నివేదించాలి. దాన్ని కుటుంబ సభ్యులందరూ ముందుగా స్వీకరించి అనంతరం ఖచ్చితంగా కనీసం అయిదుగురికైనా పంచాలి.

ధన్వంతరి ప్రార్థన

ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ

సర్వ భయ వినాశాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమఃRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE