ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు పుణ్య గతులను కలిగించే పండుగ.ఈ రోజు మూడు ప్రధానమైన పుణ్యవిధులను మన పెద్దలు నిర్దేశించారు. అవి..

 మొదటిది.. చంద్రోదయానికి ముందు చేసే నువ్వులు నూనెతో కూడిన అభ్యంగన స్నానం. ఈ చతుర్దశి నాడు లక్ష్మి దేవినువ్వుల నూనెను ఆవహించి ఉంటుంది గనుక ఈ రోజు తప్పక నువ్వులనూనె పట్టించుకోవాలని పెద్దలు చెబుతారు. అలాగే తలంటికి వాడే నీటిలో ఉత్తరేణి, తమ్మి ఆకులను నూరి కలిపి ఆ నీటితో స్నానం చేయటం వల్ల మెదడు పనితీరు బాగుంటుంది.

 రెండవది..యమా తర్పణం. స్నానానంతరం ఉత్తరేణి ఆకులను తలపై పెటుకుని, యమాయ నమః, మృత్యువేనమః, వైవస్వతాయనమః, సర్వభూతక్షయాచ నమః, ధ్ధ్నాయనమః, పరమేష్టినే నమః, చిత్రాయ నమః, ధర్మరాజాయ నమః, అంతకాయ నమః, కాలాయ నమః, ఔదుంబరాయ నమః, నీలాయ నమః, వృకోదరాయ నమః, చిత్రగుప్తాయతే నమః అనే 14 నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించాలి.దీనివల్ల పితృదేవతలకు నరకబాధ తప్పి స్వర్గప్రాప్తి కలుగుతుంది.

మూడవది.. యమదీపం.తల్లి తండ్రులు గతించిన వారు ఈ రోజు సాయంత్రం తప్పక ఇంటి దక్షిణ దిక్కున దీపం వెలిగించాలి. పితృదేవతల కోసం వెలిగించే ఈ దీపాల వెలుగులో నరకానా ఉన్న పెద్దలు స్వర్గలోకానికి పయనమవుతారని పురాణాలు చెబుతున్నాయి. చతుర్దశి సాయంకాలం ప్రదోషకాలములో దీపదానం చెయ్యాలి. Recent Storiesbpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE