నేడు కార్తీక పౌర్ణమి. శివుడికి మహాశివరాత్రి తర్వాత అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమే. ఈ రోజునే పరమేశ్వరుడు తారకాసురిని ముగ్గురు కుమారులు ఆకాశంలో నిర్మించిన 3 నగరాలతో బాటు వారినీ వధించిన కారణంగా దీనికి  త్రిపుర పౌర్ణమి అనీ, లోకకంటకులైన వారి మరణ వార్త విని దేవతలు వేడుకలు జరుపుకున్న కారణంగా దీనికి దివ్య దీపావళి అనే పేరొచ్చింది .కార్తీక పున్నమి నాడు చేసే దాన ధర్మాల ఫలితం పది యజ్ఞాలు చేసిన ఫలితం కన్నా అధికమని కార్తీక పురాణం చెబుతోంది. ఈ రోజు రాత్రి ఆలయాలన్నీ దీప కాంతులతో వెలిగిపోతాయి. రోజూ శివారాధన చేయలేనివారు రోజుకో ఒత్తి చొప్పున 365 ఒత్తులు వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. 

విశేషాలు

శ్రీ మహా విష్ణువు ఈ రోజునే దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం దాల్చాడు. ఈ రోజే తులసికి మారురూపమైన బృందా దేవి జన్మించింది. కార్తికేయుని జన్మ తిదికూడా ఈ పౌర్ణమియే. కార్తీక పున్నమి రోజునే రాదా మాధవులు’’ రాస లీల’’నిర్వహించినట్లు చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు పితృ దేవతలను స్మరిం చటం అనాదిగా మనకు వస్తున్న ఆచారం. రాజస్థాన్ లోని పుష్కర తీర్ధం లో ఈ పున్నమి నాడు గొప్ప వేడుకలు నిర్వహిస్తారు. ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం గల పుష్కర తీర్ధంలో ఈ పున్నమి రోజు పవిత్ర స్నానం చేస్తే మరో జన్మ ఉండదని చెబుతారు. తమిళనాడు లోని అరుణాచలం చుట్టూ ఈ రోజు చేసే గిరి ప్రదక్షణ, కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. గురునానక్ జయంతి గనుక సిక్కులకు, జైన గాధల వల్ల జైనులకూ ఇది పర్వదినం. 

పుణ్య విధులు

ఈ పౌర్ణమి రోజున నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. నదులు లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును.శివాలయాల్లో మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలు లేదా కేదారేశ్వర వ్రతం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. ఈ రోజు సాయంత్రం విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద, బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించటం, అలాగే శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో వెలిగించే ఆకాశదీపాన్ని దర్శించటం విశేష పుణ్యఫలం. అవకాశం ఉన్నవారు ప్రవహించే నీటిలో అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి విడవాలి. దీనివల్ల విశేష పుణ్యమే గాక సంపదలు  కలుగుతాయి.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE