ఈ భూమిపై ఎందరో యోగులు అవతరించారు. జీవితాంతం, తనువు  చాలించిన తర్వాతా వారు తమ బోధనలతోమానవాళిని సన్మార్గంలో నడుపుతూనే ఉంటారు. ఆ కోవకు చెందిన వారే షిర్డీ సాయినాథుడు. పరిపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం మూడూ కలిస్తే అది సాయితత్త్వమవుతుంది. మనుషుల పాపాలు తొలగించి జ్ఞాన దీపాలు వెలిగించడానికి, ఆదర్శ జీవనానికి బాటలు వేసి, జీవిత పరమార్థాన్ని చాటడానికి ఈ భువిపై మానవరూపంలో వచ్చిన అవతారమూర్తి. భౌతిక లంపటాలతో కొట్టిమిట్టాడుతున్న మనిషిని జ్ఞానమార్గం వైపు నడిపించిన ఆయన దర్శనమే మనిషిలోని మనోవికారాలు, మనః చాంచల్యాలనుపటాపంచలు చేసే మార్గం. 

 భక్తి, శ్రద్ధ, విశ్వాసం, సత్యం, సేవ, సహనం, దయ ప్రేమ, వినయం, విధేయత, ఋజువర్తన వంటి ఎన్నో గుణాల కలయికే సాయితత్వం. వేదాలు, ఉపనిషత్తులలోని ఉన్నతమైన భావాలను చిన్న చిన్న మాటల్లో చెప్పటమే గాక వాటిని తానూ ఆచరించి చూపిన ఆదర్శమూర్తి. సాయి రూపాన్ని తలచినా, ధ్యానిస్తే భయం, అజ్ఞానాలు వాటంతట అవే తొలగిపోతాయి. మనుషులంతా ఒక్కటేనని చెప్పటమే గాక నోరులేని జీవాలకూ అంతే ప్రాధాన్యతను ఇచ్చిన సమతామూర్తి బాబా. 

తన భోధనల ద్వారా మనిషిని సాధనా మార్గంలో పయనింపజేసి ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చేలా చేసిన గురుస్వరూపుడు సాయి. మహిమలతో గాక మానవతతో సాధారణ జీవితం గడిపటమే గాక తాను పరమాత్మ సేవకుడినని చాటిన వినయశీలి. 

బాబా ఉపదేశం మనిషి ఉన్నతికి ఆదేశం. బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన. బాబా సూక్తులు భావి జీవితానికి స్పూర్తిదాయకాలు. బాబా హితోక్తి జీవిత పరమార్థానికి దిక్సూచి. సాయి తత్త్వంలోని జ్ఞాన వికాసాన్ని మానవత్వాన్ని వంటపట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది. జీవితం ధన్యమవుతుంది. ఆధునిక మానవుని సకల సమస్యలకు ఏకైక పరిష్కారం సాయితత్వమే.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE