• HOME
  • భక్తి
  • ఉగాది పంచాంగ శ్రవణం విశిష్టత

     ఉగాది నాడు సాయంత్రం వేళ తప్పక ఆచరించే పండుగ విధుల్లో పంచాంగ శ్రవణం ముఖ్యమైనది. పంచాంగం అంటే ఐదు అంగములతో కూడుకున్నది. అవి.. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణము. అకాల మృత్యువును హరించి దీర్ఘాయువును అందించేవిగా వీటికి పేరుంది గనుకే ఉగాది సాయంత్ర వేళలో పంచాంగం వినడం ఆనవాయితీ. ఈ సమయంలో ఉత్తర ముఖంగా కూర్చుని పంచాంగం వినాలని శాస్త్రం చెబుతోంది.

 పంచాంగశ్రవణ ఫలితాన్ని వివరించే శ్లోకం 

‘శ్రీకల్యాణగుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం

 గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణామ్‌

ఆయుర్‌వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం

నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్‌’

 

‘‘ఓ మానవులారా! పంచాంగం సిరిసంపదలను, సకల మంగళాలనూ ప్రసాదిస్తుంది. ఎన్నో సుగుణాలను అందిస్తుంది. శత్రువులను , పీడకలలను, దోషాలను దూరం చేస్తుంది. గంగాది పుణ్య నదీ స్నానఫలాన్ని, గోదాన ఫలితాన్నిస్తోంది. దీర్గాయువు, ఉత్తమ జీవన మార్గాన్ని, శుభాలను, చక్కని సంతానాన్ని, ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తుంది. కనుక పంచాంగాన్ని తప్పక వినండి’ అనేదే ఈ శ్లోక భావం. ఈ రోజు పంచాగ శ్రవణంలో చెప్పే గోచార ఫలితాలు,సంవత్సర ఫలితాలను విని పండితునికి యధాశక్తి దక్షణ సమర్పించి ఆశీస్సులు తీసుకొంటారు. పంచాంగ శ్రవణ సమయంలో నవగ్రహాలను స్మరించడం ద్వారా ఆయా గ్రహాల కటాక్షం లభిస్తుంది.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE