మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త ప్రపంచాన్నీ ప్రక్షాళన చేశారు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆయనను శిలువపై వేలాడదీశారు. ఈ సమయంలోనే ప్రభువు తన అనుయాయులకు ఏడు వాగ్దానాలు చేశారు. అనంతరం కొన్ని గంటలపాటు నరక బాధను అనుభవించిన ఆ మానవతా మూర్తి ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన ఆత్మను సమర్పించారు. సర్వ మానవాళి కోసం ఆయన చిందించిన రక్తం నిర్దోషమైనది. బైబిల్ చెప్పినట్లుగా ఆయన తప్ప మరొక మార్గమూ లేదు. ఆయన తప్ప మరొక దైవమూ లేదు. ఈ రోజును విమోచన దినంగా, శుభ శుక్రవారంగా క్రైస్తవ సోదరులు పాటిస్తారు. ఈ రోజు ఆయన శిలువపై చెప్పిన మాటలను స్మరిస్తూ ప్రార్థన చేయటంతో బాటు కొందరు ఉపవాసం ఉంటారు.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE