పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే ప్రశ్నకు మనలో చాలామందికి జవాబు తెలియదు. అన్నదానం విశిష్టత ఏమిటో సద్గురు మనకు తెలియజేస్తున్నారు. అదేమిటో వారి మాటల్లోనే తెలుసుకొందాం.  

అన్నదానం చేయడంలో ఒక ఆనందం ఉంది. ఇది కేవలం ఆహారం అందించడమే కాదు. మీ భౌతిక శరీరాన్ని ‘అన్నమయ కోశం లేదా  ఆహార శరీరం అని పిలుస్తాము, ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో నిర్మించబడింది. కాబట్టి, మీరు అన్నదానం చేస్తే, వారికి శరీరాన్ని అందిస్తునట్లే. 

ఆహారం పట్ల కొంత  స్పృహని , అవగాహనని  మీలో కలుగచేయడానికి అన్నదానం మీకొక గొప్ప అవకాశం. మీరు దానిని ఆహారంగా మాత్రమే చూడొద్దు, అది జీవితం. మీ ముందు ఆహారం వున్న ప్రతి సారీ, అది వాడి  పడేసే పదార్ధంలా కాకుండా  అది   జీవం  అని అర్థం చేసుకోవాలి. మీ జీవితాన్ని ఉన్నతం చేసు కోవాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ఆహారాన్ని, నీటిని, గాలిని, భూమిని ఒక జీవంగా చూడాలి, ఎందుకంటే మీ శరీర నిర్మాణానికి ఇవే ముఖ్యమైన పదార్థాలు. మీరు వీటిని జీవాధారంగా ఆశ్రయిస్తే, అవి మీ శరీర నిర్మాణంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయి. అలాగాక మీరు వాటిని ఒక పదార్ధంగా  చూస్తే, మీ వ్యవస్థ  మార్కెట్ లా తయ్యారవుతుంది. 

ప్రేమ, అంకిత భావంతో తో  వడ్డించి, అన్నదానం చేయడం ద్వారా మీకు ఎదుటి వారితో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది  మీరు దీనిని గొప్ప అంకిత భావంతో చేస్తారు ఎందుకంటే దీని ద్వారా ఒకరికి జీవితాన్నిచ్చే అవకాశం మీరు పొందుతున్నారు. ఇది ఎంతో ప్రాముఖ్యమైంది, ఎందుకంటే ఒకరు మిమ్మల్ని తమ కన్నా ఎక్కువగా చూస్తూ మీ నుండి స్వీకరిస్తున్నారు.

            

                                                                                                                              .... ఇషా ఫౌండేషన్ సౌజన్యంతోRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE