అరుదైన అందం, చక్కని అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తార కాజల్ అగర్వాల్. పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసే తీరు నిజంగా అద్భుతం. అందం విషయంలో కాజల్ ఏమంటోంది? సౌందర్య పోషణకు పాటించే చిట్కాలేమిటి? తదితర ఆసక్తికర అంశాలను బీపాజిటివ్ మీకు అందిస్తోంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

గ్లామర్ రంగంలో ఉన్న ఎవరైనా చర్మ సౌందర్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే. కాబట్టి అందులో రాజీ పడను. ఇప్పటి రోజుల్లో పెరిగిపోతున్న కాలుష్య ప్రభావం, షూటింగ్ లో మేకప్ వల్ల చర్మం త్వరగా తేమను కోల్పోవటం సహజం. అందుకే షూటింగ్ పూర్తైన వెంటనే మేకప్ తీసి చల్లని నీటితో ముఖం కడుక్కొని మాయిశ్చరైజర్ రాయటం తప్పనిసరి. ఇక.. ఇంట్లో ఉన్నప్పుడు మేకప్ జోలికిపోను. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లైట్ మేకప్ ఉంటుంది.

 కోమలమైన చర్మం కోరుకొనే వారు తగినన్ని నీళ్లు తాగాల్సిందే. అందుకే నీళ్లు తాగటంతోనే రోజు మొదలుపెడతా. దాహంతో నిమిత్తం లేకుండా అరగంటకోసారి నీళ్లు తాగటం అలవాటు. దీనివల్ల చర్మం తేమగా ఉండటమే గాక రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మ సౌందర్యానికి కొబ్బరి నీరు, గ్రీన్ టీ ఎంతో మంచిది. అవి తాగిన ప్రతిసారీ ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్లు అనిపిస్తుంది. 

సీజన్ ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవటం, రాత్రి పడుకోబోయే ముందు తప్పనిసరిగా ముఖం కడుక్కొని , క్రీమ్ రాయటం అలవాటు. 

చర్మ సౌందర్యానికి కొబ్బరి ఉత్పత్తుల మీద ఎక్కువగా ఆధారపడతాను. కొబ్బరిపాలు కలిపిన నీటితో చేసే స్నానం, కొబ్బరితో చేసిన మాయిశ్చరైజర్, కొబ్బరి నూనెలు చర్మానికి ఎంతో మృదుత్వాన్ని తెస్తాయి. 

వారానికోసారి బాదం పలుకులు, చక్కెర వంటి వాటితో స్క్రబింగ్‌ చేయిస్తా. దీనివల్ల చర్మపు మృతకణాలు తొలగిపోతాయి. అలాగే.. వారానికోసారి ముల్తానీ మట్టితో మాస్క్ వేయించటంతో బాటు నెలకోసారి గోరు వెచ్చని నూనెతో మసాజ్ చేయిస్తాను. దీనివల్ల చర్మం చక్కగా మెరుస్తుంది.

చర్మంతో బాటు జుట్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందుకే షూటింగ్ నుంచి రాగానే రసాయనాలు లేని షాంపు, గోరు వెచ్చని నీటితో తల స్నానం చేసి మాయిశ్చరైజర్ పెడతాను. 

అందం విషయంలో శ్రద్ధ అవసరమే గానీ సౌందర్య పోషణ పేరిట ఎడాపెడా క్రీములు వాడటం సరికాదు. దీనివల్ల తాత్కాలిక సానుకూల ఫలితం ఉన్నా, దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం తప్పదు.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE