అందం, అభినయం కలిస్తే నటి.. అనుష్క. పుష్కర కాలం నాడు తెలుగు తెర మీద అరంగేట్రం చేసినా నేటికీ అగ్రనటిగా కొనసాగుతున్న తార. యోగా టీచర్ గా పనిచేసిన ఈ అమ్మడు అతితక్కువ సమయంలోనే పలు విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంది. అందం,ఆరోగ్యం, ఫిట్నెస్ వంటి విషయంలో తానుపాటించే సూత్రాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

  • యోగా నా జీవితంలో ఒక భాగం. రోజువారీ ఒత్తిళ్లను దూరం చేయటంలో దీన్ని మించిన సాధనం లేదు. అటు శరీర బరువునూ ఇది నియంత్రిస్తుంది. ముందు నుంచీ యోగా టీచర్ గా ఉండటంతో దీనిపట్ల ప్రత్యేక శ్రద్ద ఎక్కువ . అందుకే .. ఖాళీగా ఉన్నా, షూటింగ్ జరుగుతున్నా రోజులో కనీసం అరగంట యోగా చేస్తా. పలు ప్రాంతాల్లో భిన్నమైన ఆహారం తీసుకుంటున్నా, నా శరీర సమతుల్యాన్ని కాపాడుతోంది యోగానే. 
  • యోగా తర్వాత నా ప్రాధాన్య అంశం.. ఫిట్ నెస్. అందుకే.. యోగా పూర్తవగానే కసరత్తు మొదలుపెడతా. ట్రెడ్‌మిల్‌పైన జాగింగ్, కార్డియో వ్యాయామాలు ఎక్కువగా ఇష్టపడతా. అవసరమైతే తప్ప ఎక్కువ తీవ్రత గలిగిన వ్యాయామాల జోలికి పోను. 
  • మన ఆహర అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. మేలైన ఆహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని సమయానికి తీసుకోవటమూ అంతే ముఖ్యం. అల్పాహారంగా బ్రెడ్, తేనె ఎక్కువగా తీసుకుంటా. కూరగాయలూ పండ్ల సలాడ్లూ, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటా. పాత్రల స్వభావం, అవసరాలను బట్టి కొద్దిపాటి కొద్దిపాటి ఆహార పరమైన మార్పులు చేసుకొంటా. ముఖ్యంగా.. డిన్నర్ 8లోపే పూర్తిచేస్తా. 
  • అందం, ఆరోగ్యం కోరుకొనే ఎవరైనా తగినన్ని నీళ్లు తాగాలి. ప్రతి అరగంటకోసారి చొప్పున రోజులో కనీసం 6 లీటర్ల మంచినీళ్లు తాగుతా. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మాత్రం నీరు తాగాల్సిందే. దీనివల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. 
  • సహజమైన నవ్వు అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆరోగ్యానికీ దోహదం చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్నీ సీరియస్ గా తీసుకోవటం మానేసి హాయిగా నవ్వటం అలవాటు చేసుకొంటే ఆరోగ్యంతో బాటు అందంగానూ కనిపిస్తాం. 
  • అమ్మాయిల అందంలో జుట్టు పాత్ర తెలిసిందే. అదృష్టం కొద్దీ మొదట్నుంచీ నాకు పొడవైన, ఆరోగ్యకరమైన జుట్టే ఉంది. తరచూ ఆముదం, ఆలివ్, కొబ్బరి, బాదం నూనెలతో వీలున్నప్పుడల్లా జుట్టును మర్దన చేయిస్తా. దీనివల్ల జుట్టుకి సహజమైన మెరుపు రావటమే గాక శరీరంలో ని వేడి తగ్గి జుట్టు రాలటం ఆగుతుంది.
  • మెరిసే చర్మం కావాలంటే ఎప్పటికప్పుడు చర్మం మీద చేరిన వ్యర్ధాలను తొలగించాల్సిందే. అందుకే రసాయనాలు వాడిన సబ్బులకు బదులు నిమ్మరసం, శనగపిండి మిశ్రమం వాడుతా.

 

అనుష్క ప్రొఫైల్

పేరు : అనుష్క శెట్టి

ముద్దు పేరు : మ్యాక్, స్వీటీ.

రాశి : వృశ్చికం

మొదటి సినిమా : సూపర్

నటించిన భాషలు : తెలుగు, తమిళం, హిందీ.

ఎత్తు : 5 అడుగుల 10 అంగుళాలు.

బరువు : 62 కేజీలు

పుట్టిన తేది : 7 నవంబర్ 1981

ఎడ్యుకేషన్ : బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), మౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగళూరు

తల్లిదండ్రులు : ఏఎన్ విఠల్ శెట్టి, ప్రఫుల్ల

సొంతూరు : కర్ణాటకలోని మంగళూర్

వ్యాపకాలు : పాటలు వినడం, పుస్తకాలు చదవడం.

వృత్తి : నటన, మోడలింగ్.

సంగీత దర్శకుడు : ఇళయరాజా

రంగులు : నలుపు, తెలుపు

ఇష్టమైన ప్రదేశాలు : లండన్

ఆహారం : చికెన్

పుస్తకం : ది ఆల్కెమిస్ట్

ఫిట్‌నెస్ రహస్యం : యోగాRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE