తన అసమాన ప్రతిభతో తెలుగు తెరకు వెలుగు తెచ్చిన ఘనుడు. పాత్రలో పరకాయ ప్రవేశం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు ప్రేక్షకుడి నాడిని పసిగట్టటంలో ఆయనను మించిన వైద్యుడు లేడు. డాన్స్, ఫైట్ లలో ఆయన పంథాయే వేరు. మనసుల్ని కరిగించేలా, మనుషుల్ని కదిలించేలా చేసిన ఆయన డైలాగ్స్.. ఆయనను అందరివాడిని చేశాయంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా శిఖరాగ్రాన్ని  అధిరోహించటమే గాక ఆ ఘనతను నేటికీ నిలుపుకున్న అరుదైన నటుడు. లక్షలాది అభిమానులను సంపాదించుకోవటమే గాక వారిని సేవామార్గాన నడిపిన ధన్యజీవి. ఆయనే.. మన మెగాస్టార్ చిరంజీవి. నేడు ఆయన పుట్టినరోజు. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ , ఎప్పటిలాగే తెలుగు ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆకాంక్షిస్తూ .. బీపాజిటివ్   టీమ్



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE