ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఇష్టపడే అట క్రికెట్‌. మన దేశంలో దీనికున్న ప్రాచుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎండాకాలం సెలవుల్లో పిల్లల ప్రధాన వ్యాపకం క్రికెట్, టీవీ అంటే అతిశయోక్తి కాదేమో. పట్టణాలలో అయితే ఒక్కో మైదానంలో పడేసి జట్లు కూడా ఆడుకోవటం చూస్తుంటాం. అయితే  క్రికెట్ పట్ల మక్కువ ఉండటం తప్పు కాదు గానీ  ఆ ఆట ఆడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం మాత్రం ఒక్కోసారి కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. ఫుట్ బాల్, హాకీ  వంటి ఆతల మాదిరిగానే క్రికెట్ ఆటగాళ్లకూ తగినంత ఫిట్ నెస్ అవసరం. అలాగే ఈ ఆతల మాదిరిగానే క్రికెట్ ఆటగాళ్లకు గాయాలు కావటమూ సహజమే . అందుకే ఈ వేసవిలో క్రికెట్ ఆడే పిల్లలంతా తగిన అవగాహన, శిక్షణ తీసుకుని మైదానంలోకి అడుగు పెట్టటం మంచిది.  

క్రికెట్‌ ఆడేటప్పుడు సాధారణంగా  మోకాళ్లు, చేతులు, మణికట్టు, వేళ్ళు, గిలక వంటి భాగాలకు ఎంత రక్షణ ఇచ్చినా గాయాలు అవుతూనే ఉంటాయి. ఆటలో భాగంగా పరిగెత్తేటప్పుడు, బౌలింగ్‌ చేసేటప్పుడు కండరాలు పట్టేయటం, బ్యాంటింగ్‌ చేసేవారికి భుజామ్లోని కండరాలు పట్టేయటం, మోకాళ్ల లిగమెంట్స్‌ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వేగంగా బౌలింగ్ చేసే వారికి వెన్నుపూస మీద ఒత్తిడి ఎక్కువై  స్పాండిలోసిస్‌, స్పాండిలోలిస్థసిస్‌ లాంటి ఇబ్బందులు కలుగవచ్చు. 

సెలవుల్లో మండే ఎండను కూడా లెక్క చేయకుండా పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. దీనివల్ల శరీరంలోని నీరు బయటకు పోయి డీహైడ్రేషన్‌తో నీరసం, నిస్త్రాణం కలుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలు తరచూ తగినంత నీరు, గ్లూకోస్ వంటివి తీసుకోవాలి. ఉదయం 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి ఆడుకుంటే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు.

 క్రికెట్‌ ఆడాలంటే తగినంత శరీర దారుఢ్యం కావాలి.క్రికెట్ ఆటకి ముందు, తర్వాత కూడా వామప్ అవసరం. దీనివల్ల ఆటగాళ్లకు తగినంత ఫిట్ నెస్ తో బాటు శారీరక సన్నద్ధత వీలవుతుంది. ఆడేటప్పుడు అనుకోకుండా గాయాలైతే మొండిగా ఆటను కొనసాగించకుండా తప్పుకోవటం మంచిది. దెబ్బ తగిలిన భాగంలో ఐస్ ప్యాక్ పెట్టటం, రక్తం పోయే గాయమైతే వెంటనే ప్రథమ చికిత్స చేసి వైద్య సలహా కోరటం మంచిది.

 Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE