మనం ఎదుర్కొనే ఆరోగ్య సంబంధిత సమస్యల్లో అధిక బరువు ఒకటి. నీడపట్టున ఉంది ఉద్యోగాలు, పనులు చేసుకునే వారికి ఇది మరింత సమస్య. ఉద్యోగినులతో పోల్చినప్పుడు గృహిణుల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఇంటి పనులతో నిరంతరం బిజీగా ఉండే గృహిణులు ప్రత్యేకంగా వ్యాయామం చేయటం అరుదైన విషయమనే చెప్పాలి. అధిక బరువు సమస్య క్రమంగా మధుమేహం వంటి జీవనశైలి రోగాలకూ కారణం అవుతున్న నేపథ్యంలో అధిక బరువును అదుపుచేసే అంశం మీద ప్రత్యే శ్రద్ధ చూపటం ఎంతైనా అవసరం.

అనువైన ప్రత్యామ్నాయాలు

  • బరువు తగ్గాలనుకునే మహిళలకు సూర్య నమస్కారాలు చక్కని వ్యాయామం. ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రత్యేకమైన శిక్షణ, ఎలాంటి పనిముట్లు అవసరం ఉండదు. రోజూ సూర్య నమస్కారాలు చేసే వారిలో పొట్టి కడుపు భాగాన పేరుకు పోయిన కొవ్వు సులభంగా కరుగుతుంది. క్రమపద్దతిలో రోజూ పావు గంట పాటు సూర్య నమస్కారాలు చేసినా మంచి ఫలితాలు పొందవచ్చు.
  • రోజూ 20 నిమిషాలు డాన్స్ చేయటమో లేక సైకిల్ తొక్కటం ద్వారా బోలెడన్ని క్యాలరీలు కరుగుతాయి. అధిక బరువు సమస్య కూడా అదుపులోకి వస్తుంది.
  • సూర్యోదయ, సూర్యాస్తమయ సమయంలో అరగంటపాటు వాకింగ్ లేక జాగింగ్ చేయటం ద్వారా సులభంగా బరువు తగ్గుతారు. అయితే సమయం కుదరలేదని భోజనం చేసిన వెంటనే నడకకు ఉపక్రమించటం మంచిది కాదు.
  • బరువు తగ్గేందుకు, చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకొనేందుకు శాకాహారం చక్కని ప్రత్యామ్నాయం. రుచి బాగుందని మాంసాహారం అధికంగా తినటం వల్ల అనారోగ్యంతో బాటు బరువూ పెరుగుతారు.
  • తగినంత నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉండటమే గాక ఆరోగ్యమూ బాగుంటుంది. అయితే భోజనానినికి ముందు లేదా, తరువాత మాత్రమే నీరు తాగాలి. రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. మధ్యాహ్నం, రాత్రి భోజనం అయిన తరువాత గ్లాసు గోరువెచ్చని నీటిని తాగిన ట్లయితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును క్రమేపీ కరిగించుకోవచ్చు.
  • మధుమేహులు తోచిన వ్యాయామాలు చేయకూడదు. వైద్యుల సలహా మేరకు సులభమైన వ్యాయామాలు చేయటం మంచిది.
  • 40 ఏళ్ళు దాటిన మహిళలు కష్టమైన వ్యాయామాల జోలికి పోకుండా నడక, యోగా వంటివి సాధన చేయటం మంచిది.
  • బరువు తగ్గాలనుకునేవారు ఉలవలను పప్పు లేదా చారు రూపంలో వారంలో కనీసం రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. తక్కువ సమయంలో సన్నగా, నాజూకుగా తయారు కావాలనుకునే వారు బ్లాక్‌ కాఫీ తాగినా మేలైన ఫలితాలు పొందవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE