యోగాసనాల్లో ఉష్ట్రాసనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలకు చక్కని నివారిణి.  సంస్కృత భాషలో ఉష్ట్రం ఆంటే ఒంటె అని అర్థం. అందుకే ఈ ఆసనాన్నిఆంగ్లంలో  కేమేల్ పోజ్ అనీ పిలుస్తారు. ఈ ఆసనం ఎలా సాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చేసే పద్ధతి 

  • ముందుగా మోకాళ్ళ మీద కూర్చోవాలి.
  • కాళ్ళ మధ్య 6 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి.
  • దిగువ శరీరం, వెన్నెముక, మెడ సమాంతరంగా ఉంచాలి.
  • ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్ళ మీద బరువు ఉంచి రెండు చేతులనూ వెనక్కు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి.
  • ఇప్పుడు శరీర బరువును నెమ్మదిగా తొడలు, చేతుల మీద ఉంచుతూ తల, మెడను వీలైనంతగా వెనక్కు వంచి పొట్ట బాగా పైకి వచ్చేలా చూడాలి.
  • ఈ భంగిమలో శ్వాస తీసుకొని వదులుతూ 6-8 సెకన్ల వరకు ఉండి తర్వాత నెమ్మదిగా విరామ స్థితి రావాలి.

ప్రయోజనాలు

  • ఛాతీ కండరాలు గొంతు, పొత్తి కడుపు, మడమలు, తొడలు, నడుము భాగాల్ని ఈ ఆసనం బలోపేతం చేస్తుంది.
  • ఉబ్బసం వంటి ఊపిరితిత్తుల సమస్యలకు ఈ ఆసనం చక్కని నివారిణి. రోజూ సాధన చేస్తే శ్వాస కోశాల, ఊపిరితిత్తుల, ముక్కు నరాల పనితీరు మెరుగుపడుతుంది.
  • పదే పదే వచ్చే తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్‌ నివారణ, నియంత్రణకు ఈ ఆసనం దోహద పడుతుంది.
  • రోజూ సాధన చేసే మహిళలకు ఋతు సంబంధిత సమస్యలు, తలతిరుగుడు వంటి సమస్యలు ఉండవు.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE