ధ్యానం వల్ల అకారణమైన భయాలు, ఆందోళనలు దూరమవుతాయని పెద్దల నమ్మకం. దీనికి పలు శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆందోళన కలిగించే వస్తువు లేక ఘటనను చూసినప్పుడు ఇతర జీవుల కంటే మనిషే ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటాడు. మంచి కంటే చేడువైపే మనిషి ఎక్కువ ఆకర్షితమవుతాడు. కారణాల సంగతి కాసేపు పక్కన బెడితే ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకునే వారంతా రోజూ విధిగా ధ్యానం చేయటం మంచిది. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడటమే  గాక మనిషిలో దాగున్న చైతన్యం అనుభవంలోకి వస్తుంది. అన్ని మాట గ్రంథాలూ ఈ సత్యాన్ని అంగీకరిస్తున్నాయి. కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, చిక్కు సమస్యలకు పరిష్కారం కావాలంటే రోజూ కాసేపైనా ధ్యానం చేయటం అవసరమే.

చేసే పద్ధతి

  • రద్దీకి దూరంగా ఉన్న పార్కు వంటి ఏదైనా ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి.
  • మందపాటి వస్త్రాన్ని పరుచుకొని సుఖాసనంలో కూర్చోండి.
  • ఎదురుగా ఉన్న వస్తువు మీద దృష్టి కేంద్రీకరించి, ఆ రూపాన్ని మనసులో నిలుపుకునేందుకు ప్రయత్నించాలి.
  • ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకొని దృష్టిని శ్వాశ మీద నిలపండి.
  • గట్టిగా గాలి పీలుస్తూ 30 సార్లు ఉచ్చ్వాశ నిశ్వాశలను లెక్కించాలి.
  • లేని పోని ఆలోచనలు మీ మనసును చుట్టుముట్టినా మనసును లక్ష్యం మీదే నిలిపేందుకు ప్రయత్నించాలి.
  • ఇలా కాసేపు సాధన చేస్తే మనసు పూర్తిగా శ్వాశ మీదే కేంద్రీకృతమవుతుంది.
  • 'నేను సర్వశక్తివంతుడిని', ' నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను', ' నేను నా లక్ష్యాన్ని సాధించి తీరుతాను' అంటూ మనసులోనే రోజూ సంకల్పం చెప్పుకోవాలి.
  • ఈ నియమాలు పాటిస్తూ రోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తే ఒత్తిడి నుంచి విముక్తి కలగటమే గాక మంచి ఆరోగ్యం సైతం సొంతమవుతుంది.

 Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ఉగాది పంచాంగ శ్రవణం విశిష్టత

ఉగాది నాడు సాయంత్రం వేళ తప్పక ఆచరించే పండుగ విధుల్లో పంచాంగ శ్రవణం ముఖ్యమైనది. పంచాంగం అంటే ఐదు 

MORE