పతంజలి మహర్షి ప్రపంచానికి అందించిన గొప్పవరం యోగా. మనిషిలోని దైవాంశ శక్తిని బయటకు తెచ్చి మనిషిని పరిపూర్ణత దిశగా నడిపించే మార్గమిది.  శరీరంలోని శక్తిని పొదుపు చేసి దానిని సూక్ష్మ రూపాలైన మానసిక శక్తిగా మార్చటమే యోగాసనాల ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల మనిషి యొక్క ప్రజ్ఞ, జ్ఞాపక శక్తి, నైపుణ్యము పెరుగుతాయి. అయితే కొత్తగా యోగాసనాల సాధనకు ఉపక్రమించే వారు ఈ కింది నియమాలను తెలుసుకోవటం ఎంతైనా అవసరం.

  • ఆహారం తీసుకున్న వెంటనే ఆసనాలు వేయకూడదు. అల్పాహారం తర్వాత కనీసం 2 గంటలు , భోజనం తర్వాత 4 గంటలు ఆగి మాత్రమే ఆసనాలు సాధన చేయాలి.
  • స్నానానికి ముందు అరగంట లేదా  తర్వాత అరగంట వ్యవధి ఇచ్చి యోగాసనాలు సాధన చేయాలి.
  • కష్టతరమైన కసరత్తులు, సున్నితమైన ఆసనాలు వెంట వెంటనే సాధన చేయకూడదు. కావాలనుకుంటే కసరత్తు తర్వాత 10 నిమిషాలు శవాసనంలో ఉండి తర్వాత ఇతర ఆసనాలు సాధన చేయొచ్చు.
  • హడావుడిగా ఆసనాలు సాధన చేయకూడదు. ప్రశాంత వాతావరణంలో నింపాదిగా, శ్రద్ధతో ఆసనాలు సాధన చేస్తేనే చక్కని ఫలితాలు వస్తాయి.
  • వరుసగా అనేక ఆసనాలు సాధన చేసేవారు వాటిమధ్య కనీసం 5 నిమిషాల సమయం ఉండేలా చూసుకోవాలి.
  • ఆసనాలు చేసిన తర్వాత సాధకుడు గతంలో కంటే ఉల్లాసంగా , మరింత చైతన్యంగా ఉండాలి తప్ప నీరసం, అలసట పొందరాదు. ఒకవేళ ఇలా వుంటే సరైన విధంగా ఆసనాలు సాధన చేయలేదని భావించాలి.
  • సాధన తొలినాళ్ళలోనే కష్టమైన ఆసనాలు చేయరాదు.
  • స్త్రీలు నెలసరి సమయంలో ఆసనాలు వేయకూడదు.
  • గర్భిణులు 5వ నెల వరకూ తేలికపాటి ఆసనాలు సాధన చేయవచ్చు గానీ ఆ తర్వాత ఆపాలి . ప్రసవానంతరం  3 నెలల తర్వాత వైద్యుల అనుమతితో ఆసనాలు సాధన చేయవచ్చు.Recent Storiesbpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE