• అపరిశుభ్రమైన ప్రదేశంలో, ఘాటైన, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
  • సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
  • మైదానంలోగాని, పెరటిలో గాని, తలుపులు తెరచిఉన్న గదిలోగాని, కంబళీ లేక మందమైన బట్ట లేక ఏదైనా ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
  • గాలి విపరీతంగా వీస్తుంటే ప్రాణాయామం చేయకూడదు.
  • తిన్న వెంటనే ప్రాణాయామం చేయకూడదు.
  • ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు. అయితే చివరలో మాత్రం శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
  • ప్రాణాయామం చేసేటప్పుడు వదులైన, సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి.
  • పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువైన ఆసనాలు. నేల మీద కూర్చోలేనివారు, కుర్చీలో నిటారుగా కూర్చొని కూడా ప్రాణాయామం చేయవచ్చు.
  • ప్రాణాయామం చేసేటప్పుడు నడుము , వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణాయామం చేయాలి.
  • ప్రాణాయామం చేసేటపుడు కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితో మూయాలి.
  • ముక్కు దిబ్బడ ఉంటే ప్రాణాయామం చేసే ముందు జలనేతి(ముక్కులో నీరుపోసి నాసికా రంధ్రాలను తెరవటం), సూత్రనేతి( దారం సాయంతో ముక్కు రంద్రాన్ని తెరవటం)క్రియలు సక్రమంగా చేస్తే శ్వాస సరిగ్గా ఆడుతుంది.
  • ప్రాణాయామ సమయంలో మనసును పూర్తిగా శ్వాస మీదే కేంద్రీకరించాలి.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE