జగత్తుకు ఆధారమైన సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధించటం భారతీయ సంప్రదాయం. సూర్యోదయ వేళ ఉదయ భానునికి అభిముఖంగా నీటిలో నిలిచి భక్తి శ్రద్దలతో అర్ఘ్యం సమర్పించి, అనంతరం  సూర్య నమస్కారం చేయటం గతంలో రోజువారీ విధుల్లో భాగంగా ఉండేది. తర్వాత వచ్చిన కాలానుగుణమైన మార్పుల కారణంగా ఇది కేవలం భక్తికి సంబంధించిన వ్యవహారంగా లేదా ఒక వర్గపు ఆచారంగా పరిమితమైపోయింది. శ్రద్ధగా గమనిస్తే ఆరోగ్యం వంటి మరెన్నో అంశాలను దృష్టిలో పెట్టుకొనే మన పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ఏర్పరచారని నిస్సందేహంగా చెప్పొచ్చు. సూర్య నమస్కారంలోని 12 భంగిమలో 12 రకాల ప్రయోజనాలను అందిస్తాయి. సూర్య నమస్కారంలోని 1 నుంచి 5 వరకు ఉన్న భంగిమలే కుడిఎడమల తేడాతో 8 నుంచి 12 వరకు ఉంటాయి. మొత్తం 12 పూర్తయితేనే సూర్యనమస్కారాన్ని పరిపూర్ణంగా చేసినట్లుగా భావించాలి.

చేసే క్రమం

1 . సూర్య నమస్కారంలోని తొలి ఆసనం నమస్కారాసనం. సూర్యునికి ఎదురుగా నిటారుగా నిలిచి చేతులు జోడించి నమస్కారం చేయాలి.

 1. ఇప్పుడు కొద్దిగా శ్వాస పీల్చి చేతులు పైకి చాచి, కాళ్ళు వంచకుండా తలను, నడుమును వెనుకకు తేలికగా వాల్చాలి. దీనిని హస్త ఉత్తానాసనం అంటారు.
 2. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ ముందుకు వంగి అరచేతులను కాళ్ళకు ఆనించాలి. దీన్ని పాదహస్తాసనం అంటారు.
 3. అనంతరం ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి. దీన్ని ఆంజనేయాసనం అంటారు.
 4. కాళ్ళు, వీలున్నంత మేర అరచేతులు నేలకు తాకిస్తూ నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి. ఇది పర్వతాసనం.
 5. ఇప్పుడు సాష్టాంగ (అష్టాంగ) నమస్కారం చేయాలి. అంటే రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం నేలను తాకేలా చేతులు చాచి నమస్కారం చేయటం. తర్వాత నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.
 6. శ్వాసను పీల్చి తలను నెమ్మదిగా వీలున్నంత వెనుకకు వంచాలి. ఇది సర్పాసనం
 7. అయిదవ భంగిమలో మాదిరిగా కాళ్ళు, వీలున్నంత మేర అరచేతులు నెలకు తాకిస్తూ నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి. ఇది పర్వతాసనం.
 8. నాల్గవ భంగిమ మాదిరిగా కుడికాలి మీద బరువు మోపుతూ ఎడమ కాలిని వెనక్కు చాచాలి. చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి. ఇది ఆంజనేయాసనం.
 9. మూడవ భంగిమ మాదిరిగా రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి. ఇది పాదహస్తాసనం.
 10. రెండవ భంగిమ రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి. ఇది హస్త ఉత్తానాసనం
 11. తొలి భంగిమకు వచ్చి నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి. ఇది నమస్కారాసనం.

భంగిమలు.. ఉపయోగాలు

 

1, 12 భంగిమలు - శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీరక కదలికలో సమతుల్యత సాధించవచ్చు. వెన్ను, మెడ, భుజ కండరాలు బలపడతాయి.

2, 11 భంగిమలు- వెన్నుపూస, పిక్కలు, పిరుదులు బలపడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

3, 10 భంగిమలు- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. థైరాయిడ్, పీయూష గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది.

4,9 భంగిమలు- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.

5, 8 భంగిమలు- గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

6 వ భంగిమ- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

7 వ భంగిమ- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నుపూస బలంగా మారడానికి ఉపకరిస్తుంది.

ఇతర ప్రయోజనాలు 

 • సూర్య నమస్కారం చేస్తే ఏరోబిక్స్‌ చేసినట్టే.
 • శ్వాస నియంత్రణలోకి వస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
 • బరువు తగ్గి జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది.
 • సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలపడతాయి.
 • మధుమేహం, రక్తపోటు అదుపులోకి వస్తాయి.
 • మానసిక ఆందోళనలు తొలగి ప్రశాంతత చేకూరుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE