సంస్కృతంలో మత్స్యం అంటే చేప. నీటిలో ఈదే చేపను పోలిన ఆసనం కావటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఎక్కడైనా సులభంగా చేయదగిన ఈ ఆసనం చేసే పద్దతి, దాని మూలంగా కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
పద్దతి
- ముందుగా ప్రశాంతమైన వాతావరణంలో పద్మాసనంలో కూర్చోవాలి.
- మోచేతులను సపోర్టుగా చేసుకొని అదే భంగిమలో వెల్లికలా పడుకోవాలి.
- ఇప్పుడు నెమ్మదిగా బరువును తల, మోచేతుల మీద మోపుతూ ఎద, పొట్ట భాగాలను వీలున్నంత మేర పైకి లేపాలి.
- రెండు చేతులతో కాలి బొటనవ్రేళ్లను పట్టుకొని కొంతసేపు శ్వాసను పట్టి ఉంచాలి.
- తరువాత శ్వాస వదులుతూ చేతులపై బరువుంచి మెల్లగా పైకి లేచి, తిరిగి పద్మాసన భంగిమలోకి రావాలి.
ఉపయోగాలు
- ఊపిరి తిత్తులు శుభ్రపడి ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
- గంటల తరబడి కంప్యూటర్ మీద పని చేయటం వల్ల కలిగిన మీద, వెన్ను నొప్పి బాధితులకు ఈ ఆసనం వల్ల తగినంత ఉపశమనం లభిస్తుంది.
- నెలకోతీరుగా ఋతుక్రమం వస్తున్నా వారు రోజూ ఈ ఆసనం వేస్తే సమస్య దారికొస్తుంది.
- థైరాయిడ్,రక్తప్రసరణ లోపాలు, హృదయ స్పందన లోపాలు సరిదిద్దబడతాయి.
- వెన్నుముక, తుంటి భాగాలకు, గర్భాశయమునకు లాభదాయకం.
- ముఖ వర్చస్సు పెరుగుతుంది.