మైదానంలో చేసే వ్యాయామాల్లో రన్నింగ్ ముఖ్యమైనది. కసరత్తుకు శరీరాన్ని సిద్ధం చేసే అత్యుత్తమ, సులభమైన వ్యాయామం పరుగే. రన్నింగ్ సమయంలో నూటికి 90 శాతం మంది షూ వాడతారు. షూ లేకుండా  ఒట్టి కాళ్లతో పరుగెత్తటం ఏ మాత్రం మంచిది కాదని కూడా వీరు భావిస్తుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఒట్టి కాళ్లతో పరిగెత్తగలిగితే చక్కని శారీరక సామర్ధ్యంతో బాటు ఆరోగ్యపరమైన మేలు చేకూరుతుందని  క్రీడానిపుణులు చెబుతున్నారు.

ఉపయోగాలు

 • ఒట్టి కాళ్లతో పరుగెట్టటం సహజమైన, మేలైన ప్రక్రియ.
 • అరికాలు భూమిని ఏ మేరకు తాకుతుందనే అంశాన్ని బట్టి షూ అవసరమా లేదా అని తేల్చుకోవాలి. షూ వాడినప్పటి కంటే ఒట్టి కాళ్లతో రన్నింగ్ చేసినప్పుడు పాదపు కండరాలు, కీళ్ల మధ్యన పడే ఒత్తిడి 3 రెట్లు  తక్కువని పలు పరిశోధనల్లో తేలింది.
 • ఒట్టి కాళ్ళతో పరిగెత్తేటప్పుడు మడమలు, కాలి వేళ్ళు నేరుగా భూమిని తాకి తగినంత ఒత్తిడిని కలిగించి తద్వారా సులువుగా ముందుకు దూసుకు పోయేందుకు అవసరమైన శక్తిని పుంజుకునేలా చేస్తాయి.
 • ఇలా పరుగెత్తటం వల్ల అరికాళ్ళలోని సున్నితమైన నరాలు నేరుగా భూమిని తాకటం వల్ల ఆయా భాగాలలో రక్తప్రసరణ మెరుగు పడుతుంది.

జాగ్రత్తలు

 • పాదాలు, మడమల పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి నిపుణులు సరేనన్నతర్వాతే ఒట్టి కాళ్ళతో రన్నింగ్ చేయాలి.
 • ఆరంభించిన తొలిరోజే ఎక్కువ దూరం రన్నింగ్ చేయరాదు. రోజూ కొద్దీ దూరం చేస్తూ పాదాలు బలోపేతమయ్యే కొద్దీ దూరాన్ని పెంచుకోవాలి.
 • ముందుగా నడక, తర్వాత జాగింగ్ చేస్తూ చివరగా రన్నింగ్ చేయాలి తప్ప ఏకబిగిన రన్నింగ్ చేయరాదు.
 • రన్నింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆగుతూ ముందుకు సాగాలి. లేకుంటే అరికాళ్ళలో తిమ్మిర్లు వచ్చే ముప్పు ఉంటుంది.
 • సిమెంట్, తారు రోడ్ల మీద ఒట్టికాళ్ళతో రన్నింగ్ చేయరాదు. మట్టిరోడ్డు, ఇసుక మార్గాల్లో మాత్రమే ఒట్టికాళ్ళతో రన్నింగ్ చేయాలి.
 • మధుమేహులు ఒట్టికాళ్ళతో రన్నింగ్ చేయటం ఏమాత్రం మంచిది కాదు. వీరు తప్పక మెత్తని, తేలికపాటి కాన్వాస్ ధరించాల్సిందే.
 • రన్నింగ్ చేసే దారిన బురద, ముళ్ళు, రాళ్లు లేకుండా చూసుకోవాల్సిందే.
 • ఒట్టి కాళ్లతో రన్నింగ్ చేయబోయే వారు తప్పక శరీర బరువు, ఇతరత్రా అనారోగ్య సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలి . Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE