ఒక్క అజీర్తి సమస్య ఉంటే సమస్త అనారోగ్యాలూ ఉన్నట్టే. వ్యాయామం లేకపోవటం, పీచు తక్కువగా ఆహారం తీసుకోవటం, ఆరోగ్యం కంటే రుచికి ప్రాధాన్యం ఇవ్వటం వంటి పలు కారణాల మూలంగా ప్రస్తుతం చాలా మంది అజీర్తి బారిన పడుతున్నారు. వీరు రోజూ పవన ముక్తాసనం సాధన చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. 

సాధన పద్దతి

 • సమతలంగా ఉన్న చోట కార్పెట్ పరచుకొని వెల్లికిలా పడుకోవాలి.
 • ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడికాలిని పైకి మడిచి పొట్ట వరకు అరచేతులతో పట్టుకొని తీసుకురావాలి.
 • తర్వాత మెల్లగా శ్వాస వదులుతూ తలనిమోకాలి వైపు వంచాలి.
 • ఇలా పెదవులు మోకాలిని తాకేవరకూ వంచాలి.
 • ఇప్పుడు 20 సెకన్లు అదే భంగిమలో ఉండి నెమ్మదిగా శ్వాస వదులుతూ తిరిగి తలని, కాలిని పూర్వ స్థానానికి తీసుకురావాలి.
 • ఇలాగే ఎడమ కాలితో కూడా చెయ్యాలి.
 • ముందు కుడి వైపు, తర్వాత ఎడమ వైపు 6 సార్లు చొప్పునమార్చిమార్చి సాధన చేయాలి.

ఉపయోగాలు

 • రక్తంలోని వ్యర్ధాలను తొలగించి పూర్తిగా శుభ్రపరచేందుకు ఈ ఆసనం దోహదపడుతుంది.
 • తరచూ తలనొప్పి, అసహనం, అజీర్తిఈ ఆసనం సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
 • ఈ ఆసన సాధనతో ఛాతీ, ఉదర భాగపు కండరాలు గట్టిపడతాయి.
 • ఆ ఆసనం సాధన చేసే రోజుల్లో ఎక్కువ నీరు తాగితే మరింత మంచి ఫలితాలుంటాయి.Recent Storiesbpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE