వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అయితే చేస్తున్న వ్యాయామం తమ అవసరాలకు తగినట్లుగా ఉందా? లేక మార్పులు అవసరమా అని వ్యాయామం చేసేవారు తప్పక ఆలోచించుకోవాలి. మంచి శారీరక సౌష్టవం కోసం,బరువు తగ్గాలని, మంచి నిద్ర పట్టేందుకు.. ఇలా అవసరం మారిన కొద్దీ వ్యాయాయం చేసే విధానంలో మార్పులు అవసరం. దీనితో బాటు వ్యాయామం చేసేవారంతా తమ ఆరోగ్య పరిస్థితి, అవసరాలు, శరీర స్వభావం, వయసు, వ్యాయామ సమయంవంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
- వ్యాయామం చేసేవారు తమ వెసులుబాటు, అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ఉద్యోగులు సాయంత్రం 7 తర్వాతే ఇంటికి చేరతారు. ఆ సమయంలో వ్యాయామంచేసే సమయం, ఓపిక ఉండవు గనుక విధిలేక ఉదయం పూటే వ్యాయామం చేస్తుంటారు. అయితే ఉదయం నిద్ర లేచే సమయానికి శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది గనుక ఆ సమయంలో సరైన సన్నాహక వ్యాయామాలు లేకుండా నేరుగా వ్యాయామం చేయటం వల్ల కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పులు.. వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వీరు రాత్రి 8 గంటలలోపు ఇంటిలోనే ఉంది చేసుకోదగిన వ్యాయామం చేయాలి.
- అలాగే ఆస్తమా, ఇస్నోఫీలియా, పోలెన్ ఎలర్జీ (పువ్వులో ఉండే పరాగరేణువుల వల్ల కలిగే ఎలర్జీ) ఉన్నవారు ఆ సమయంలో వ్యాయామం చేయటం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు రావచ్చు. అందుకే వీరు సాయంత్రమే వ్యాయామం చేయటమే మంచిది. అవకాశమా ఉన్నవారు సాయంత్రం 5 గంటలకు చేస్తేమరీ మంచిది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ శరీరం మీరు చేసే వ్యాయామానికి బాగా సహకరిస్తుంది.
- బరువు తగ్గించుకునేందుకు ఉదయం కసరత్తు చేసే వారు తమ సాధన చేసి స్నానం చేసి అల్పాహారం తీసుకోవాలి. ఇలా చేయటం వలనశరీరంలో చేరిన కొవ్వు 20% తొందరగా కరుగుతుంది. ఒకవేళ అల్పాహారం చేసి కసరత్తు చేస్తే ఉన్న కేలరీలు కరగకపోగాఅదనపు కేలరీలు చేరతాయి.
- సుఖ నిద్రను కోరి వ్యాయామం చేసేవారు7 నుంచి 8 గంటల లోపు రాత్రి భోజనం ముగించితేలికపాటి దూరం నడవటం, అరగంటపాటు షటిల్ ఆడటం మంచిది.
- ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలనుకునే వారు సూర్యోదయానికి ముందే వ్యాయామం చేయాలి. భరించలేని ఒత్తిడి ఉన్నవారు ఆ సమయంలో పావుగంట పాటు దీర్ఘంగా శ్వాస తీసుకోవటం, వదలటం చేయాలి.
- సాధారణ ఆరోగ్యం కోరేవారు ఉదయం లేదా సాయంత్రం... వారంలో 15 నుంచి 20 గంటలు బ్రిస్క్ వాకింగ్ లేదా 8 గంటలు రన్నింగ్ చేస్తే చాలు.