రక్తంలోని వ్యర్ధాలను వడకట్టి, వాటిని మూత్రం రూపంలో బయటకు పంపటమే  మూత్రపిండాల (కిడ్నీల) ప్రధాన విధి. ప్రస్తుతం పలు కారణాల వల్ల ఏటా కిడ్నీ బాధితుల సమస్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రోజూ మార్జాలాసనం సాధన చేయటం ద్వారా కిడ్నీ సంబంధిత సమస్యలను ముందుగానే నివారించవచ్చు.

మార్జాలాసనం

మార్జాలం అంటే పిల్లి. కోపంగా ఉన్న పిల్లి వెన్నును సాగదీసి, మరుక్షణంలో మునుపటి స్థితికి తెచ్చినట్లే ఈ ఆసనంలోని భంగిమలూ ఉంటాయి.

చేసే పద్దతి

  • చేతులను గడ్డం కింద పెట్టుకొని బోర్లాపడుకొని విశ్రాంతి భంగిమలోకి రావాలి.
  • అర చేతులను పూర్తిగా నేలకు ఆనించి, నెమ్మదిగా మోకాళ్ళ మీద శరీరాన్ని పైకి లేపాలి. ఈ క్రమంలో మోచేతులు వంచకుండా నిటారుగా పెట్టాలి.
  • నెమ్మదిగా శ్వాస తీసుకొంటూ వీపును కిందికి వంచి తలను పైకెత్తాలి.
  • తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ వీపును పైకి లేపుతూ తలను కిందికి వంచి బొడ్డువైపు చూడాలి.
  • ఇలా రోజుకు 10 సార్లు సాధన చేసిన తర్వాత 10 నిమిషాల పాటు బోర్లా పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. 

ఇతర ఉపయోగాలు

  • వెన్నుపూస కదలికలు మెరుగవుతాయి. భుజాలు, మోచేతులు, మణికట్టు భాగాలు శక్తివంతం అవుతాయి.
  • ఆస్తమా, థైరాయిడ్, గుండె సమస్యలు తొలగిపోతాయి. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
  • అజీర్తి, మలబద్ధకం తొలగిపోతాయి. నడుము కండరాలు బలోపేతం అవుతాయి.
  • ఒళ్ళు చేసిన బాలింతలు ఈ ఆసనం వేస్తే మునుపటి నాజూకైన శరీరాకృతి పొందుతారు. 

గమనిక: వెన్నుపూస సమస్యలు,మెడ నొప్పి ఉన్నవారు ఈ ఆసనం చేయకూడదు.

            మోకాళ్ళ నొప్పులు, అధిక బరువున్న వారు కూడా ఈ ఆసనం జోలికి పోరాదు.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE