రోజూ కాసేపు ప్రాణాయామం చేయటం మంచిదే. సాధన చేసే తీరును బట్టి ప్రాణాయామ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా.. కొత్తగా ప్రాణాయామ సాధన చేసేవారు ఒకటి రెండు రోజులు నిపుణుల శిక్షణ పొందటం అవసరం. దీనివల్ల ప్రాణాయామ సాధన విషయంలో తగినంత అవగాహన ఏర్పడటమే గాక సాధనలో వచ్చే సమస్యలూ అవగతమవుతాయి.  ప్రాణాయామ ప్రయోజనాలు, సాధన పద్దతి వంటి అంశాల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇలా చేయాలి

 • ప్రాణాయామ సాధనకు సూర్యోదయ సమయం మంచిది. ప్రాణాయామానికి ముందుగా కడుపు నిండా తినరాదని గుర్తించుకోవాలి. 
 • జోరుగాలి, ఘాటైన దుర్వాసన, పొగ, రణగొణ ధ్వనులు ఉన్న చోట ప్రాణాయామం చేయవద్దు. అందుకే ప్రశాంతమైన పార్కు లేదా బహిరంగ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. ఇంట్లో సాధన చేయాలనుకుంటే గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదిని ఎంపిక చేసుకోవాలి.
 • చదునైన చోటు చూసుకొని మెత్తని వస్త్రాన్ని పరచి సుఖాసనంలో ప్రాణాయామ సాధనకు కూర్చోవాలి. మోకాళ్ళ నొప్పులున్న వారు కుర్చీలోనే నిటారుగా కూర్చొని సాధన చేయవచ్చు.
 • ముందుగా వెన్నుపూసను నిటారుగా నిలిపి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు శ్వాస తీసుకొని వదులుతూ ఓంకారాన్ని ఊహించుకోండి. దీనివల్ల ఏకాగ్రత నిలిచి మనసు అటూ ఇటూ మళ్లకుండా ఉంటుంది.
 • అనంతరం కుడి ముక్కు రంధ్రాన్ని కుడి చేతి బొటన వేలితో మూసి ఎడమ రంధ్రం ద్వారా శ్వాస తీసుకొని కొద్దిసేపు స్ధంభింప చేసి నెమ్మదిగా బైటకు వదలాలి. 10 సార్లు చేసిన తర్వాత ఇదే విధంగా 10 సార్లు ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరపు వేలితో మూసి శ్వాస తీసుకొని వదలాలి.
 • ప్రాణాయామానికి ముందు ఆసనాలు వేస్తే కాసేపు శవాసనం వేసి పూర్తి విరామ స్థితిలోకి వచ్చిన తర్వాతే ప్రాణాయామం ఆరంభించాలి. 

ప్రయోజనాలు

 • ప్రాణాయామ సాధన చేస్తే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడి శరీరానికి తగినంత ప్రాణవాయువు అందుతుంది.
 • నాడులు, జీర్ణ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే ప్రేవులు పూర్తి స్ధాయిలో శుభ్ర పడ తాయి.
 • హృదయ కండరాలు, ధమనుల పనితీరు మెరుగుపడుతుంది.
 • జఠర రసం వృద్ధి చెంది చక్కని ఆకలి, అరుగుదల ఉంటాయి.
 • మెదడు చురుకుగా పనిచేస్తుంది.
 • మానసిక ఒత్తిడి తొలగిపోయి ఉత్సాహంగా కనిపిస్తారు.
 • ఆయుః ప్రమాణం పెరుగుతుంది.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE