మన శరీరంలో శిరస్సు మొదలు అరికాళ్ళ వరకు లక్షలాది నాడులుంటాయి. జీవక్రియల నిర్వహణలో వీటి పాత్ర ఎంతో కీలకం. ఈ నాడుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, దెబ్బతిన్న వీటి పనితీరును మెరుగు పరచే ఆసనమే.. తాడాసనం. సంస్కృతంలో 'తాడ' అంటే పర్వతమని     అర్థం. నాడుల పనితీరుతో బాటు కాలి మడమలు , పిక్కల దృఢత్వానికీ ఈ ఆసనం ఎంతగానో దోహదం చేస్తుంది.

సాధనా ప‌ద్ధ‌తి

చదునైన నేల మీద నిటారుగా నిలబడి కాళ్ళు దగ్గరగా పెట్టాలి. ఈ భంగిమలో బొటన వేలి నుంచి మడమల వరకు తాకుతూ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండు అరచేతులను కలిపి పైకి తీసుకుని వెళ్లి, వ్రేళ్లలో వ్రేళ్లు చొప్పించాలి (ఇంటర్‌లాక్). ఈ భంగిమలో చేతులు వంచుకుండా నిటారుగా పెట్టాలి. ఇప్పుడు దీర్ఘశ్వాస తీసుకుని రెండు అరచేతులనూ ఆకాశం వైపు వీలున్నమేరకు పైకి లేపుతూ.. కాలి మునివేళ్లపై శరీర బరువును నిలపాలి.  ఈ భంగిమలో మోకాళ్ళు, తొడలు, పిరుదలు, ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా ఉండేలా చూడాలి. ఈ స్థితిలో శ్వాస తీసుకోకుండా ఉండగలిగినంత సేపు ఉండి, ఆ తర్వాత నిదానంగా రెండు అరచేతులను తలపై బోర్లించి పాదాలను దించుతూ భూమికి ఆనేలా చూడాలి. తరువాత కాళ్ళను దూరం చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి. ఇలా 10 సార్లు  సాధన చేయాలి.  

 ప్రయోజనాలు

 ఎత్తు పెరగాలనుకొనే వారికి ఓ మేరకు ఈ ఆసనం ఉపయోగపడుతుంది. నాడులు, ఎముకలు, కండరాలు, కాలివేళ్లు, మడమలు, మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు, చేతివేళ్లు బలోపేతమవుతాయి.  

గమనిక: మోకాళ్లు నొప్పులున్నవారు, భుజాల కీళ్లు అరిగిపోయిన వాళ్లు ఈ ఆసనం సాధన చేయరాదు.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE