అలసిన శరీరానికి తగినంత విశ్రాంతినిచ్చి తిరిగి ఉత్సాహంగా పనిచేసేలా చేయగల ఆసనాల్లో జేస్టికాసనం ఒకటి. వయసుతో నిమిత్తం లేకుండా సాధన చేయదగిన ఈ ఆసనాన్ని గర్భిణులు, పొట్టకు సంబంధిత గాయాలైన వారు మాత్రం సాధన చేయకపోవటమే మంచిది. ఈ ఆసనపు వివరాలు తెలుసుకుందాం. 

సాధనా పద్దతి

  • ముందుగా సమతలంగా ఉన్న నేల మీద చాప వేసుకొని బోర్లా పడుకోవాలి.
  • కాళ్లను నిటారుగా, పక్కపక్కనే పెట్టి నుదిటిని నేలను తాకేలా పెట్టాలి.
  • ఇప్పుడు అదే భంగిమలో చేతులను మెడవెనక్కు తెచ్చి కలిపి వేళ్ళను పెనవేసి మెడ వెనక భాగాన అనేలా పెట్టాలి. (మోచేతులు నేలకు ఆనించి ఉంచితే సౌకర్యంగా ఉంటుంది.)
  • ఈ దశలో 2 నిమిషాలు సాధారణ స్థాయి శ్వాస తీసుకుంటూ మనసును శ్వాసపై నిలపాలి.
  • ఆసనం చివరిగా మోకాళ్ళ మీద నెమ్మదిగా లేచి సుఖాసనంలోకి కూర్చోవాలి.

ప్రయోజనాలు

  • వెన్నుపూస, మెడ కదలికలు సరళతరమవుతాయి. వెన్నుపూసకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.
  • సెర్వికల్ స్పాండిలైసిస్‌తో బాధితులకు ఇదెంతో ప్రయోజనకారి.
  • మానసిక ఒత్తిడిని దూరంచేసి ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE