వయసుతో బాటు వచ్చే వెన్ను సమస్యలతో బాటు రోజంతా కూర్చొని పనిచేయటం వల్ల ఎదురయ్యే వెన్నునొప్పికి సేతుబంధనాసనం మంచి చికిత్సగా పనిచేస్తుంది. సేతువు అంటే వంతెన. వంతెన మాదిరిగా ఆసనపు భంగిమ ఉంటుంది గనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనపు సాధనా పద్ధతి, ఉపయోగాలను తెలుసుకుందాం. 

సాధనా పద్ధతి

  • ముందుగా సమతలంగా నేల మీద చాప పరచి దానిపై వెల్లికిలా పడుకోవాలి. చేతులు నడుముకు పక్కగా చాచి ఉంచాలి.
  • ఇప్పుడు కాళ్లను దగ్గరిగా మడిచి నిలపాలి. అరచేతులను నేలకు ఆనేలా ఉంచాలి.  
  • ఇప్పుడు గట్టిగా శ్వాస తీసుకుని తలను అలాగే ఉంచి భుజాలు, అరికాళ్ళ దన్నుతో నెమ్మదిగా నడుమును వీలున్నమేరకు పైకి లేపాలి.
  • శ్వాస తీసుకుని వదులుతూ 2 నిమిషాలు ఇదే భంగిమను కొనసాగించాలి.
  • ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుని, నెమ్మదిగా వదులుతూ నడుమును నెమ్మదిగా దించి విశ్రాంతి స్థితిలోకి రావాలి.
  • కొత్తగా ఈ ఆసనం సాధన చేసేవారు 4 పర్యాయాలతో మొదలుపెట్టి క్రమంగా 10 వరకు పెంచుకొంటూ పోవాలి. 

ప్రయోజనాలు

వెన్నునొప్పి తగ్గుతుంది. పిక్కలు, పిరుదులు, వెన్నుపూస, నడుము, భుజాలు, ఛాతీ కండరాల కదలికలు సరళతరమవుతాయి. ముందునుంచి సాధన చేస్తే వెన్ను సమస్యలు దరిజేరవు. మానసిక ఒత్తిడి తగ్గి భావోద్వేగాల మీద నియంత్రణ వస్తుంది. 

గమనిక : ఈ ఆసనం సాధన చేసేటప్పుడు తలను అటూ ఇటూ తిప్పటం, నడుమును వేగంగా పైకి ఎత్తటం, మెడమీద శరీర బరువు మోపటం చేయకూడదు.

వెన్ను, మెడ, భుజాల నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం జోలికి పోవద్దు.



Recent Stories







bpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ఉగాది పంచాంగ శ్రవణం విశిష్టత

ఉగాది నాడు సాయంత్రం వేళ తప్పక ఆచరించే పండుగ విధుల్లో పంచాంగ శ్రవణం ముఖ్యమైనది. పంచాంగం అంటే ఐదు 

MORE