కుక్కుటము అంటే కోడి. ఈ ఆసనంలో సాధకుడు శరీర బరువును అరచేతుల మీద నిలిపి కోడి మాదిరిగా కనిపిస్తాడు గనుక దీనికాపేరు వచ్చింది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచటంలో ఈ ఆసనం విశేషంగా దోహదపడుతుంది.

సాధన

 • ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత ధ్యాన ముద్ర తీసేసి రెండు చేతులనూ కాళ్లలో గుండా దూర్చి అరచేతులు నేలకు ఆనించాలి.
 • ఇప్పుడు అదే భంగిమలో ఉంటూ నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపాలి. శరీర బరువంతా అరచేతుల మీద మోపుతూ అటూ ఇటూ పడిపోకుండా చూసుకోవాలి. శరీరాన్ని నిటారుగా ఉంచి చూపును ఎదురుగా ఉన్న వస్తువు మీద కేంద్రీకరించాలి.
 • ఈ భంగిమలో 10 సెకన్లు ఉండి నెమ్మదిగా శరీరాన్ని కిందికి తెచ్చి కూర్చొన్న భంగిమలోకి రావాలి.
 • తర్వాత మెల్లగా చేతులను కాళ్ళ మధ్యనుంచి తీసి తిరిగి పద్మాసనానికి రావాలి.
 • ఇలా రోజూ 5 సార్లు చొప్పున సాధన చేయాలి.

ప్రయోజనాలు

 • పైల్స్ బాధితులు ఈ ఆసనం సాధన చేస్తే సమస్య పూర్తిగా అదుపులో ఉంటుంది.
 • రోజూ ఈ ఆసనం సాధన చేస్తే భుజాలు, చేతులు, మణికట్లు, నడుము కండరాలు బలపడతాయి.
 • పొత్తి కడుపు వద్ద పేరుకున్న కొవ్వు కరుగుతుంది.
 • జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది.
 • ఊపిరి తిత్తులు విశాలమై శ్వాస మెరుగుపడుతుంది.
 • నిద్రాణంగా ఉన్న మూలాధార చక్రం చైతన్యవంతమవుతుంది.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE