మనలో చాలామంది జిమ్ లో చేసే వ్యాయామంతోనే శారీరక దృఢత్వం సాధించవచ్చని అనుకుంటారు. కానీ.. తేలికపాటి వ్యాయామాలు సైతం మన శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అలాంటివాటిలో జాగింగ్ ఒకటి. అన్నివయసుల వారూ సులభంగా, సౌకర్యవంతంగా చేయదగిన వ్యాయామామిది. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ప్రశాంతమైన ప్రదేశంలో రోజుకు అరగంటపాటు జాగింగ్ చేసినా చక్కని ఫలితాన్ని పొందొచ్చని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. జాగింగ్ ప్రయోజనాలు, దానికి సంబంధించిన సూచనల గురించి వారు చెబుతున్న అంశాలను తెలుసుకొని ఈ రోజునుంచే జాగింగ్ చేసేద్దాం.

ఉపయోగాలు 

 • జాగింగ్ అందరికీ మేలుచేసే వ్యాయామమే అయినా అధికబరువు, ఊబకాయ బాధితులకు ఇది మెరుగైన వ్యాయామం. పౌష్టికాహారం తీసుకొంటూ 2 నెలలు క్రమం తప్పక డా జాగింగ్‌ చేస్తే ఏ చికిత్స లేకుండానే అదనపు బరువును తగ్గించుకోవచ్చు.
 • ఉషోదయ ఆహ్లాదకర వాతావరణంలో జాగింగ్ చేస్తే ఎంతటి మానసిక ఒత్తిడైనా వదిలిపోతుంది.
 • రోజూ క్రమం తప్పక జాగింగ్ చేసేవారిలో ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి.
 • ఉదయం చేసే జాగింగ్ వల్ల రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి, మెదడుకు రక్తసరఫరా పెరిగి అధికరక్తపోటు, హృదయ సమస్యలు సైతం దూరమవుతాయి.
 • పడుకున్నవెంటనే నిద్రపట్టటంతో బాటు ఉదయం అనుకున్న వేళకు మెలకువ రావాలంటే జాగింగ్ చేయాల్సిందే అని నిపుణులు సూచిస్తున్నారు.
 • కలతనిద్ర, మధ్యలో మెలకువ రావటం తదితర సమస్యల బాధితులు ఉదయం గంట సమయం జాగింగ్ చేస్తే తప్పక సుఖనిద్రను పొందుతారు.
 • రోజూ జాగింగ్ చేయటం వల్ల మధుమేహపు ముప్పు తగ్గుతుంది. మధుమేహం ఉంటే అదుపులో ఉంటుంది. వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే ప్రమాదమున్నయువత ముందునుంచీ జాగింగ్‌ చేస్తే మధుమేహం ఆలస్యంగా రావటం, వచ్చినా అదుపులో ఉంటుంది. అయితే జాగింగ్ చేసే మధుమేహులు పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

ముఖ్యాంశాలు

 • జాగింగ్ సౌకర్యవంతమైన, ఉల్లాసకరమైన వ్యాయామం మాత్రమే. జాగింగ్ విషయంలో అధిక వేగం పనికిరాదు. తేలికపాటి వేగంతో జాగింగ్ చేస్తే చాలు.
 • వారానికి కనీసం 150 నిమిషాలు జాగింగ్ చేయగలిగితే చాలు. అతిగా జాగింగ్ చేస్తే ఆ ప్రభావం గుండె, రక్తప్రసరణ వ్యవస్థల మీద ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
 • జాగింగ్ ఫలితం పూర్తిగా దక్కాలంటే జాగింగ్ కు తగిన ఆహారం తీసుకోవాల్సిందే. సాధారణంగా జాగింగ్ తర్వాత అరటిపండు లేదా బనానా షేక్‌ మంచి ప్రత్యామ్నాయం. ఉదయాన్నేఅరటి పండు ఇష్టపడనివారు ఫ్రూట్ సలాడ్ లేదా గ్రీన్ సలాడ్ తీసుకున్నా చాలు.
 • జాగింగ్ తర్వాత తీసుకోదగిన ఇతర పోషకాహారాల్లో ఉడికించిన గుడ్డు, ఆవిరిమీద ఉడికించిన చేప, ఓట్‌మీల్స్‌, నానబెట్టిన బాదం గింజలు, పెరుగు, పండ్లముక్కల మిశ్రమం వంటివి కూడా మంచిదే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE