గర్భసంచి పటుత్వాన్ని పెంచి గర్భధారణ నుంచి కాన్పు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ఆసనమే గర్భ పిండాసనం. గర్భం ధరించిన మొదటి 3 నెలల్లో ఈ ఆసనం సాధన చేసే మహిళల్లో గర్భస్రావం ముప్పు కూడా బాగా తగ్గుతుంది.

సాధనా విధానం

  • ముందుగా చాప మీద కూర్చోవాలి.
  • తర్వాత నెమ్మదిగా కాళ్ళు చాపి, వెన్నుపూసను నిటారుగా ఉంచి పాదాలు దగ్గరికి పెట్టాలి.
  • ఇప్పుడు రెండు చేతులతో ఎడమ పాదాన్ని కుడి తొడమీద, ఆ తర్వాత కుడి పాదాన్ని ఎడమ తొడపైనపెట్టాలి. (పద్మాసనంలో లాగా)
  • ఇప్పుడు రెండు కాళ్ళ సందుల్లో నుంచి 2 చేతులు పోనిచ్చి రెండు చెవులు పట్టుకోవాలి.
  • చెవులు పట్టుకోవటం కుదరకపోతే వాటిని తాకినా చాలు.
  • ఈ భంగిమలో ఆటూ ఇటూ పడిపోకుండా శరీరాన్ని బ్యాలన్స్ చేసుకోవాలి.
  • ఇదే భంగిమలో ఊపిరి పీలిస్తూ 10 సెకన్ల పాటు ఉండి తిరిగి నెమ్మదిగా పూర్వస్థితికి రావాలి.

ఉపయోగాలు

  • ఈ ఆసనాన్ని రోజూ సాధన చేస్తే ఉదర కండరాలు గట్టిపడి బానపొట్ట సైతం కరిగి స్లిమ్ అవుతారు.
  • గర్భాశయ మరియు జీర్ణకోశ సంబంధ రోగాలు దరిజేరవు.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE