నడుము, పొత్తికడుపు కండరాలను బలపరచి ఆసనాల్లో పాదవృత్తాసనం ఒకటి. కాస్త సౌకర్యంగా ఉన్న ఎక్కడైనా సాధన చేయగలిగిన ఆసనమిది. కొత్తగా సాధన చేసేవారు గురువుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని సాధన చేయాలి.

సాధన

చదునుగా, సౌకర్యంగా ఉన్న చోట చాప వేసుకొని వెల్లికలా పడుకోవాలి. రెండుకాళ్ళూ ఎడంగా పెట్టాలి. ఇప్పుడు కుడికాలును పైకిలేపి దాన్ని గడియారపు ముళ్ళు తిరిగే దిశలో తిప్పాలి. ఈ సమయంలో రెండోకాలు, నడుము కదలకుండా చూసుకోవాలి. ఇలా 5 సార్లు చేసిన తర్వాత కాలిని అపసవ్య దిశలో తిప్పాలి. పై విధంగానే ఈసారి ఎడమకాలితో సవ్య, అపసవ్య దిశలో 5 సార్లు చొప్పున తిప్పాలి. చివరగా రెండుకాళ్లను కలిపి నిలబెట్టి సవ్య, అపసవ్య దిశల్లో 5 సార్లు చొప్పున తిప్పి తిరిగి విరామ స్థితికి రావాలి. 

ఉపయోగాలు

  • అన్ని అవయవాలూ కదిలి శక్తివంతం అవుతాయి.
  • బలహీనంగా ఉన్న కీళ్లు గట్టిపడతాయి.
  • పొత్తికడుపు కింది కొవ్వు కరిగి పొట్ట తగ్గిపోతుంది.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE