ఈ మధ్య కాలంలో యువత శారీరక దారుఢ్యం మీద బాగా దృష్టి పెడుతున్నారు. దీనికోసం గంటల తరబడి జిమ్ లో కసరత్తును వెనకాడటం లేదు. త్వరగా మంచి ఫిట్ నెస్ సాధించాలనే తపనలో పడి సహజమైన ఆహారానికి బదులుగా మార్కెట్లో దొరికే కృత్రిమ ప్రొటీన్‌ పౌడర్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. అయితే.. అవగాహన లేకుండా ఎక్కువ ప్రొటీన్‌ వాడితే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రోటీన్ అవసరం ఎంత ?

మనం తీసుకొనే ఆహారం ద్వారా లభించే ప్రొటీన్లు శరీరంలోని కండరాల నిర్మాణానికి దోహదపడతాయి. అయితే మన వృత్తిని బట్టి కండరాలకు తగిన పని ఉంటుంది. ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువగా, నీడపట్టున ఉండేవారికి తక్కువగా ప్రొటీన్ల అవసరం ఉంటుంది. అవసరమైన మోతాదుకు మించి ప్రోటీన్లు తీసుకొనేవారు కఠినమైన వ్యాయామాలు లేదా చెమట చిందేలా పని చేస్తేనే తీసుకున్న అదనపు ప్రోటీన్లు ఖర్చవుతాయి. లేకుంటే అవి క్యాలరీలుగా కొవ్వు రూపంలో శరీరంలో పోగుపడి బరువు పెరిగేలా చేస్తాయి . అప్పుడు ఈ అదనపు  బరువు తగ్గించుకోవాలంటే కఠినమైన వ్యాయామం చేయకతప్పదు. కాబట్టి అవసరం లేనివాళ్లు అదనపు ప్రొటీన్ల జోలికి వెళ్లకూడదు.

రోజుకి ఎంత అవసరం?

నిపుణులు సూచిస్తున్న లెక్కల ప్రకారం పురుషులకు రోజులు 56గ్రా, మహిళలైతే 45గ్రా సహజసిద్ధమైన ప్రొటీన్లు అవసరం. 11-14 ఏళ్ల వయసు పిల్లలకు శరీర బరువు ఎంత ఉంటే అన్ని గ్రాముల ప్రొటీన్‌, 14- 18 వయసు పిల్లలకు శరీర బరువులో కిలోకు 0.8 గ్రాములు, గర్భిణులు కిలో శరీర బరువుకు 1.5గ్రా ప్రొటీన్‌, మెనోపాజ్‌ మహిళలకు కిలో శరీర బరువుకు 1గ్రాముల చొప్పున ప్రొటీన్‌ అవసరం. ఆయా  వ్యక్తుల వృత్తి, వయసు వంటి అంశాలను బట్టి ఈ లెక్కలు మారతాయి.

ప్రొటీన్లు మోతాదు మించితే ?

   రోజువారీగా ఖర్చయ్యే క్యాలరీల లెక్కను బట్టి తగినన్ని ప్రొటీన్లను తీసుకోవాలి. అవసరానికి మించి ప్రొటీన్లు తీసుకుంటే ఈ దిగువ సమస్యలు రావచ్చు. 

  • మితిమీరి ప్రొటీన్లు తీసుకుంటే శరీరంలో ఆమ్లం ఉత్పత్తి పెరగటంతో ఎక్కువైన ఆమ్లాన్ని శరీరం బయటికి పంపే ప్రయత్నంలో భాగంగా ఎముకల నుంచి కాల్షియంను సైతం విసర్జించటంతో ఎముకలు బలహీనపడతాయి.
  • అవసరానికి మించి ప్రొటీన్లు తీసుకొనే వారిలో కీటోన్లు పెరిగి వాటిని వడకట్టటం మూత్రపిండాలకు కష్టమవుతుంది. దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగితే మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.
  • ఎక్కువగా ప్రొటీన్లను తీసుకోవటం వల్ల మూత్రపిండాల మీద ఒత్తిడి పెరిగటం, దీనికి తోడు కష్టమైన కసరత్తులు చేయటం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో వెళ్ళిపోయి శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE