శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, దాన్ని సరైన పద్దతిలో, క్రమబద్దంగా సాధన చేయటమూ అంటే అవసరం. తేలిక పాటి వ్యాయామాల సంగతి పక్కన పెడితే బరువులు ఎత్తే వ్యాయామాలు చేసేవారు ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి . లేకపోతే బారువుల ప్రభావం వెన్నుపూస మీద పడి  దాని పనితీరు దెబ్బతినటం,  ప్రమాదాలకు గురికావటం జరిగే ప్రమాదం ఉంటుంది . అందుకే జిమ్ లో బరువులతో కూడిన వ్యాయామం  చేసే వారు వెయిట్ బెల్ట్స్ వాడుతారు. ఈ సంగతి తెలియని వాళ్ళు వాటిని నడుము సైజు తగ్గించే బెల్తులని అపోహపడుతుంటారు .  ఈ బెల్టులు వాడటం వాళ్ళ పెద్ద పెద్ద బరువులు ఎత్తే సమయంలో పొట్టి కడుపు దిగువ భాగంలో ఎక్కువ ఒత్తిడి పది, ఆ మేరకు నడుము, వెన్నుపూస దిగువ భాగం మీద  ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామ పరిభాషలో దీనిని ' హూప్ టెన్షన్ ' అని అంటారు.

పనితీరు

 మనిషి ముందుకు వంగినప్పుడు అతని పొత్తికడుపు కండరాలు సంకోచించి  వెన్నుపూసలోని దిగువ భాగంలో ఉండే ఎల్ -4, ఎల్-5  డిస్కుల మీద ఒత్తిడి పడుతుంది. ముందుకు వంగటం ఎక్కువయ్యే కొద్దీ ఈ ఒత్తిడి కూడా పెరుగుతూ పోతుంది . బరువులు ఎత్తే సమయంలో ఇది సాధారణ్ ఒత్తిడి కంటే 300 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు బెల్ట్ వాడక పొతే నడుము విరిగిపోయే ప్రమాదం ఉంటుంది . అయితే కేవలం బరువులు ఎత్తే సమయంలోనే ఈ బెల్ట్ వాడాలి తప్ప రోజంతా పెట్టుకుంటే పొత్తి  కడుపు  కండరాల సహజ సంకోచ, వ్యాకోచాలు దెబ్బ తిని బెల్ట్ లేనప్పుడు నడుము మీద ఒత్తిడి ఎక్కువవుతుంది . 

ఇతర కీలక అంశాలు

  • ఉదర భాగంలోని రక్త కణాలు కలిగించే ఒత్తిడి కంటే బయటినుంచి కలిగే ఒత్తిడి తక్కువగా ఉండాలనేది నిపుణుల మాట .లేకపోతే గుండెకు రక్తం సరఫరా కాదు. దీనివల్ల ప్రాణాపాయం ఏర్పడే ముప్పు ఉంటుంది. 
  • బెల్ట్ వెడల్పు అంశం కూడా ప్రధానమే . శరీరాకృతి , బరువు, చేసే వ్యాయామాల స్వభావం వంటి పలు అంశాలను బట్టి ఇది మారుతూ వుంటుంది గనుక నిపుణుల సలహా కోరటం మంచిది .
  • బరువులు ఎత్తే అథ్లెట్లు దీర్ఘమైన శ్వాస తీసుకుని క్రమంగా గాలి వదులుతూ బరువులను ఎత్తుతారు . అయితే ఈ సూత్రం భారీ బరువులు ఎత్తే వారి విషయంలో పనిచేయదు. ఇలాంటి సమయంలో దీర్ఘంగా శ్వాస తీసుకుని కొండ నాలుక వద్ద గాలిని నిలిపి, పొత్తికడుపు మీద ఒత్తిడి పెంచాలి . దీనివల్ల ఎక్కువ బరువు లేపటమే గాక వెన్నుపూస మీద కూడా ఎలాంటి ప్రభావం పడదు .
  • నైలాన్ బెల్ట్ కంటే తోలు బెల్ట్ వాడటమే మంచిదని గుర్తుంచుకోవాలి .

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE