ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా గాయాల పాలవుతుంటాం. ముఖ్యంగా.. వ్యాయామం చేసేటప్పుడు, బరువులెత్తేటప్పుడు, రోడ్డు ప్రమాదాలు, సైకిల్ తొక్కుతూ పడిపోవటం, కుర్చీలోంచి పడిపోవటం, నడుస్తూ జారి పడిన సందర్భాల్లో భుజం కండరాలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతాయి. ఇలాంటి సమయంలో అవసరమైన వైద్య చికిత్సతో బాటు ఫిజియో థెరపీ కూడా అవసరమవుతుంది. 

  మన శరీరంలోని ఇతర కీళ్లతో పోల్చినప్పుడు భుజం కీలు నిర్మాణం, పనితీరు ఎంతో భిన్నమైనది. ఇది 360 డిగ్రీల కోణంలో వేగంగా, సులువుగా తిరుగుతూ ఉంటుంది గనుకే ప్రమాదం సమయంలో ఎక్కువగా గాయపడుతుంది. ఒక్కోసారి ఇంట్లో ఒంటి చేత్తో బరువులు మోసినా, వేగంగా వ్యాయామం చేసినా, హఠాత్తుగా పడిపోయినా.. భుజం పట్టటం, కాలర్ బోన్ దెబ్బతినటం, గూడజారటం వంటి సమస్యలు వస్తాయి. అప్పుడు భుజం కీలు ఒత్తిడికి లోనై దానిచుట్టూ ఉండే సున్నితమైన కండరాలు చీరుకుపోయి భుజం నొప్పి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫిజియో చేసే మేలు అంతాఇంతా కాదు. సరైన అవగాహన, కొద్దిపాటి శిక్షణ ఉంటే ఎవరికివారు ఇంట్లోనే ఫిజియో థెరపీ లాభాలను పొందొచ్చు. 

భుజ గాయానికి ఇదీ చికిత్స

సమస్య రాగానే ముందుగా వైద్యులను సంప్రదించాలి. వారు ముందుగా.. అల్ట్రా సౌండ్, లేజర్ థెరపీల సాయంతో దెబ్బతిన్న భుజ భాగంలో రక్త సరఫరా పెంచి నొప్పికారక కణజాలాన్ని తొలగేలా చేస్తారు. ఆ తర్వాత భుజాన్ని సాఫీగా తిప్పటం, కదిలించటం, చిన్న చిన్న వ్యాయామాలు చేయటం ద్వారా భుజం కదలికలు మెరుగుపడతాయి. ఇదే సమయంలో భుజం కండరాలు నెమ్మదిగా బలం పుంజుకునేలా చూస్తారు. భుజం కీలు చుట్టూ ఉండే కండరాలు ఎంత బలపడితే భుజం నొప్పి అంత త్వరగా తగ్గుతుంది. 

మేలైన వ్యాయామాలు

1.పెండ్యులర్ వ్యాయామం

ఏదైనా టేబుల్ లేదా కుర్చీ మీద నొప్పి లేని చేతిని ఆధారంగా పెట్టి నెమ్మదిగా ముందుకు వంగి నొప్పి ఉన్న చేతిని కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి గడియారపు లోలకం మాదిరిగా లయ బద్ధంగా ఉపాలి. కొన్నాళ్ల తర్వాత ఈ వ్యాయామం చేసేటప్పుడు చిన్న చిన్న బరువులూ పట్టుకోవచ్చు.

2. ఫింగర్ లాడర్ వ్యాయామం

భుజం కదలికలను సులభతరం చేసి ఈ వ్యాయామంలో మెట్లు మెట్లుగా ఉండే చెక్కబద్దను గోడకు బిగిస్తారు. దీనిపై నొప్పి ఉన్న చేతివేళ్ళను పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ చెక్కబద్ద చివరిమెట్టు వరకు తీసుకెళ్లాలి.

ఉపయోగాలు

  • నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • భుజం కదలికలో మెరుగుదల కనిపిస్తుంది.
  • భుజపు అనుబంధ కండరాలు బలపడతాయి.
  • భుజం సహజంగా, సౌకర్యంగా పనిచేస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE