ఆటలు ఆడేటప్పుడు, వ్యాయామ సమయంలో తగిన సైజు, ఆకృతి గల షూస్‌ వాడటం తప్పనిసరనే సంగతి తెలిసిందే. దీనివల్ల వేగవంతమైన శారీరక కదలికల ప్రభావం మోకాళ్లు, పాదాలపై పడకుండా తగినంత రక్షణ లభిస్తుంది. చేసే వ్యాయామాన్నిబట్టి షూ ఎంపిక కూడా మారుతుంది. మరి.. ఏ వ్యాయామానికి వాడే షూ ఎంపిక ఎలా ఉండాలో తెలుసుకుందాం.

  • రన్నింగ్ షూ కుషన్, బౌన్స్ ఎక్కువగా అందాలి.
  • టెన్నిస్‌ ఆడేవారు పాదాన్ని కోరిన రీతిగా వంచేందుకు వీలుగా ఉండే షూ ఎంపిక చేసుకోవాలి.
  • వాకింగ్‌, జాగింగ్‌ చేసేవారు గట్టి బేస్‌ ఉన్న షూ వాడాలి.
  • వారానికి కనీసం 5 రోజులు రన్నింగ్‌ చేసేవారు 9 నెలలకు ఒకసారి, రోజూ వాకింగ్ చేసేవారు ఏడాదికోసారి షూ మార్చాలి.
  • నాసిరకం షూ కంటే కాస్త ధర ఎక్కువైనా మంచివి తీసుకొంటే ఎక్కువకాలం తగినట్లు మన్నుతాయి.
  • కొత్త షూ కొనేటప్పుడు పాదం సైజులో వచ్చిన మార్పులను పరిగణలోకి తీసుకోవాలి.
  • ఎంపిక చేసిన షూ వ్యాయామ సమయంలో పాదానికి పట్టే చెమటను ఎప్పటికప్పుడు పీల్చుకొనేలా ఉండాలి.
  • షూ లేస్ విప్పగానే పాదాన్ని సులభంగా బయటికి తీసేంత వెసులుబాటు ఉన్న షూ సరైనదిగా భావించాలి. అలాగని వేళ్ళ భాగంలో ఇరుకుగా ఉండే షూ తీసుకోవద్దు.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ఉగాది పంచాంగ శ్రవణం విశిష్టత

ఉగాది నాడు సాయంత్రం వేళ తప్పక ఆచరించే పండుగ విధుల్లో పంచాంగ శ్రవణం ముఖ్యమైనది. పంచాంగం అంటే ఐదు 

MORE