యోగ ప్రక్రియలో కాయకల్ప యోగ అత్యంత ప్రశంసనీయమైనది. నాడీ, జీవక్రియలను మెరుగు పరచటంతో బాటు శరీరానికి యవ్వనాన్ని తెచ్చిపెట్టటం దీని ప్రత్యేకతలు. ఇది శారీరక పుష్టితో బాటు ఆధ్యాత్మిక సిద్ధినీ అందిస్తుంది.

సాధనా విధి

ఈ యోగాన్ని గురువు పర్యవేక్షణలోనే చేయాలి. కాయకల్ప యోగా పలు విధానాల సమ్మేళనం. ముక్కుతో గాలి పీల్చి నెమ్మదిగా నోటితో వదలటం, భస్తిక అంటే.. ముక్కు ఒక రంధ్రం ద్వారా శ్వాస తీసుకొని ఆ రంధ్రాన్నిమూసి వేరే రంధ్రం నుండి శ్వాసను వదలటం, మర్ధన, మూలికా చికిత్సల వంటి పలు సాధనలు ఉన్నాయి. 

ఉపయోగాలు

  • కాయకల్ప యోగా జీవిత కాలాన్ని పెంచటమే గాక వృద్దాప్య ఛాయలు రాకుండా చేస్తుంది.
  • శరీరపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  • వ్యసనాలు, అనారోగ్య కారక అలవాట్లను వదిలిపోయేలా చేసేందుకు దోహదపడుతుంది.
  • వంశానుగతంగా వచ్చే అనారోగ్య సమస్యల కట్టడి, ప్రతికూల స్వభావాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
  • మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బలోపేతమై సంతానం కలుగుతుంది. రుతు సమస్యలు తొలగిపోతాయి.
  • ఉబ్బసం, మధుమేహం, అర్శమొలలు మరియు చర్మ సంబంధ వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది.
  • నాడీ వ్యవస్థ, మెదడు కణాలను చురుకుగా వుంచి పనితీరు పెరిగేలా చేస్తుంది.
  • అతి భావోద్వేగాలను అదుపు చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆధ్యాత్మిక భావనలు కలగజేస్తుంది.
  • బరువు అదుపులో ఉండేలా చేస్తుంది.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE