రెండు చేతులు పైకెత్తి వేసే ఆసనం గనుక దీనికి ఊర్ధ్వహస్తాసనం అని పేరు. రోజూ ఈ ఆసనాన్ని సాధన చేసేవారికి జీర్ణ సంబంధిత సమస్యలు రావు. ఈ ఆసన సాధన ఎలాగో తెలుసుకుందాం. 

సాధనా విధానం

  • బోర్లా పడుకొని చేతుల మీద శరీర బరువు నిలపాలి. తలను పాము పాడగా మాదిరిగా పైకిలేపి ఉంచాలి.
  • ఇప్పుడు నడుమును పైకి లేపి ఒక్కో కాలు ముందుకు తెచ్చి నిటారుగా నిలబడాలి.
  • ఇప్పుడు రెండు అరచేతులూ దగ్గరకు తెచ్చి కలపాలి. చేతివేళ్ళు మెలివేసుకొని చేతులెత్తాలి.
  • చేతులు అలాగే ఉంచి నెమ్మదిగా శ్వాస వదులుతూ నడుము పైభాగాన్ని కుడివైపుకు వంచాలి. శ్వాస పీలుసూ తిరిగి యధాస్థితికి రావాలి.
  • తర్వాత ఇలాగే.. నడుమును ఎడమవైపుకు వంచి చేయాలి. కుడి - ఎడమ 5 సార్లు, ఎడమ-కుడి 5 సార్లు వంచి సాధన చేయాలి. ఈ ఆసనంలో నడుము మాత్రమేకాళ్ళు చేతులు వంచరాదు.

ప్రయోజనాలు

  • పెద్దపేగు కదలికలు మెరుగుపడతాయి.
  • ఉదరంలో చిక్కుకున్న వ్యర్థాలు వదిలిపోతాయి.
  • సుఖ విరేచనం అవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE