వ్యాయామాలన్నిటిలో అత్యంత సులభమైనది నడక. అన్ని వయసుల వారికీ, అన్ని కాలాలలో చేయదగిన వ్యాయామమిది. అవకాసం ఉన్న ఎక్కడైనా దీనిని సాధన చేయొచ్చు. నయాపైసా ఖర్చు లేని, ప్రమాదాలకు అవకాశం లేని సురక్షితమైన వ్యాయామం నడకే. నడక ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నడక వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం.

  • అకారణంగా వేధించే మానసిక సమస్యలు, అర్థం పర్థం లేని ఆందోళనల నుంచి నడక ఉపశమనాన్ని ఇస్తుంది.
  • రోజూ కనీసం అరగంట పాటైనా నడిచే అలవాటు ఉన్నవారికి హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ.
  • ఎముకలు, కీళ్ళ పటుత్వానికికి నడక ఎంతగానో దోహదం చేస్తుంది.
  • జీవన శైలి మార్పులతో ఊబకాయం బారిన పడిన వారికి నడక చక్కని ప్రత్యామ్నాయ వ్యాయామం. రోజూ ఒకటిన్నర కిలోమీటర్ దూరం నడిస్తే సుమారుగా వంద కేలరీలు తగ్గించుకోవచ్చు. ఈ దూరాన్ని పావుగంట లేక అంట కంటే తక్కువ సమయంలో నడిస్తే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి.
  • రక్తపోటు, మధుమేహం పూర్తిగా అదుపులో ఉంటాయి.
  • ఎలాంటి పరికరాలూ అవసరం లేదు గనుక అదనపు ఖర్చు లేనట్టే.
  • మానసికోల్లాసానికి దోహదం చేస్తుంది.
  • రోజూ క్రమం తప్పకుండా నడిచే అలవాటున్న వారు కాన్సర్ బారినపడే ప్రమాదం బాగా తక్కువ.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ఉగాది పంచాంగ శ్రవణం విశిష్టత

ఉగాది నాడు సాయంత్రం వేళ తప్పక ఆచరించే పండుగ విధుల్లో పంచాంగ శ్రవణం ముఖ్యమైనది. పంచాంగం అంటే ఐదు 

MORE