ఈ ఆసన స్థితి చెట్టును పోలి ఉంటుంది గనుక దీనికి వృక్షాసనం అని పేరు. రోజూ వృక్షాసన సాధన చేసేవారి ఏకాగ్రత పెరుగుతుంది. కీళ్లనొప్పులు తగ్గుతాయి. మోకాళ్లు, గిలక, అరికాళ్లు, భుజాలు, చేతివేళ్లకు రక్తప్రసరణ మెరుగుపడి వాటి పనితీరులో సానుకూల మార్పులొస్తాయి. శరీర ఆకృతి తగురీతిగా మారుతుంది. అయితే అధిక బరువు, మోకాళ్ల నొప్పులు, శారీరక బలహీనత ఉన్నవారు వృక్షాసనాన్ని చేయకపోవడమే మంచిది!

సాధన ఇలా...

ముందుగా పాదాలను దగ్గరగా ఉంచి, వెన్నుపూసను నిటారుగా నిలిపి నిలబడాలి. తర్వాత కుడి పాదాన్ని పైకి లేపి ఎడమ తొడకు ఆనించి నిలపాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులను లేపి ఆకాశానికి నమస్కారం చేస్తున్న భంగిమలో ఉంచాలి. ఈ స్థితిలో శరీరాన్ని వీలున్న మేరకు పైకి సాగదీయాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసతీసుకొని వదులుతూ ఎదురుగా ఉన్న ఏదైనా వస్తువు మీద దృష్టిని, మనసును కేంద్రీకరించాలి. ఈ భంగిమలో ఉండగలిగినంత సేపు ఉండి.. ఆ తర్వాత చేతులను పక్షి రెక్కలు విప్పినట్లుగా పక్కలకు తీసుకువచ్చి కిందకు తీసుకురావాలి. చివరగా కుడికాలిని దించి రెండుకాళ్ళూ పక్కపక్కన బెట్టాలి. ఈ సారి ఎడమ అరికాలిని కుడి తొడకు ఆనించి పై విధంగా చేయాలి. ఇలా 5-6సార్లు చేయాలి. ఈ దశను సాధన చేసిన తర్వాత రెండవ దశను సాధన చేయాలి.

ఆసనం మీద బాగా పట్టు వచ్చిన తర్వాత దృష్టిని ఎదురుగా ఉన్న వస్తువుల మీద గాకుండా తలను పెకైత్తి నమస్కారం చేసిన చేతులను చూడాలి. మరింత సాధన తర్వాత చివరి దశలో… ఒక చేత్తో వంచిన కాలి మడమను పట్టుకుని ఒక చేతిని పైకి చాచి, ఆ చేతి మీద దృష్టి కేంద్రీకరించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE