పప్పు ధాన్యాల్లో పోషకాల పరంగా శనగలు ముందుంటాయి.  వీటిలో లభించే పలు ఆవశ్యక  పోషకాలు పిల్లల నుంచి పెద్దలవరకు ఎంతగానో ఉపయోగపడతాయి. మన దేశంలో అన్ని ప్రాంతాల్లో శనగల వినియోగం కనిపిస్తుంది. శనగలను ఉడికించి గుగ్గిళ్ళుగా తిన్నా, మొలకల రూపంలూ తీసుకున్నా వాటి రుచే వేరు. రోజూ ఏదో ఒకరూపంలో శనగలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పూజలు, వ్రతాల్లోనూ శనగలను ప్రసాదంగా ఇవ్వటం తెలుగునాట సంప్రదాయంగా ఉంది. శనగల వల్ల చేకూరే పలు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

  • మధుమేహులు శనగలు తింటే రక్తంలోని చక్కెర నిల్వలు అదుపులో ఉంటుంది. వీటిలోని పీచు సైతం చక్కెర నియంత్రణకు దోహదపడుతుంది.
  • శనగాల్లో లభించే పైధో న్యూట్రియంట్లు ఎముకలు గుల్లబరకుండా చూస్తాయి.
  • మహిళలు,చిన్నారుల్లో కనిపించే రక్తహీనతకు శనగలు మంచి మందు.
  • రక్తపోటును అదుపులో ఉంచి గుండెజబ్బులు రాకుండా చేస్తాయి. శనగల్లోని ఫోలేట్ హోమోసిస్తీన్ అనే అమైనో ఆమ్లం గుండె రక్తనాళాలను మూసుకుపోకుండా చూస్తుంది.
  • అన్ని వయసుల వారికీ సులభంగా జీర్ణమయ్యే శనగలు జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
  • రోగనిరోధక శక్తిని పెంచటంతో బాటు చెడు కొలెస్ట్రాల్ ను తొలగించటానికీ దోహదపడతాయి.
  • అధిక బరువుతో బాధపడే వారికి శనగలు మంచి ఆహారం.గుప్పెడు శనగలు తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది.
  • శనగల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ము క్యాన్సర్ నివారణకు, మెనోపాజ్ దశలో కనిపించే సమస్యలకు మందుగా పనిచేస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE